Today Rasi Phalalu in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరభంలా భావించాలి. మీరు క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఈ రోజు మీ నక్షత్రాలు, రాశులు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండనున్నాయి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేషం (Today Rasi Phalalu in Telugu)
మీరు విశ్రాంతి లేకుండా కష్టించి పనిచేస్తున్న వ్యక్తి అయితే, విరామం తీసుకోవాల్సిన తరుణం ఇది. సెలవు తీసుకుని మీ మనసుకు నచ్చిన పని చేయండి. మీకు అర్హత ఉందని భావించి కొత్త నెలను గొప్పగా ప్రారంభించండి. ఈ వారం మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ పనిలో సహాయపడేందుకు పలు అంశాలు కలిసొస్తాయి.


Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ


 


వృషభం
మాట్లాడాలని అనుకున్నా.. కొంతకాలం నుంచి దూరంగా ఉంచిన వ్యక్తులను కలుసుకునే సూచన ఉంది. వారితో మాట్లాడితే మీకు విలువైన విషయాలు తెలుస్తాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. స్నేహం, మరియు కుటుంబం అనే విషయాలలో మీకు మంచి గోచరిస్తుంది. మొదటి అడుగు వేసి చొరవతో మీరు మాట్లాడితే మిగతావన్నీ సజావుగా జరుగుతాయి.



మిథునం
మీరు ఏదైనా విషయంపై అభిప్రానికి వస్తే, దానిపై నమ్మకం కొనసాగించండి. ఈరోజు మీకు అన్ని శక్తులు అనుకూలించనున్నాయి. మీరు అనుభూతి చెందుతున్న ప్రతిదానిని కొత్త పద్దతిలో వీక్షిస్తారు. ఎంతోకాలం నుంచి మీరు ఎదురుచూస్తున్న శుభవార్తను మీరు స్వీకరించవచ్చు.


కర్కాటకం
మీ సున్నితమైన వ్యక్తిత్వం మీకు ఉత్తమమైనది. మీరు ఈరోజు ధైర్యంగా ఉంటారు. మీ సున్నితత్వాన్ని పక్కన పెట్టి, మీకు బలమైన అంశాలను అన్వేషించండి. మీరు సాధారణంగా చేయని పనిని యత్నించాలి. కొంతకాలం నుంచి మీరు చెప్పాలనుకుంటున్న విషయాలపై నోరు విప్పండి. మీరు చేసే పనులపై మీకే ఆశ్చర్యం కలుగుతుంది.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు



సింహం
మీలో ఉన్న సింహం నిజంగా లోపల దాగి ఉంటుంది. ఈ రోజు మీరు సాధారణం కన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇది మీకు నెల మొత్తం మంచి చేసే సూచన కనిపిస్తుంది. మీరు చేయాలనుకున్నది ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకు సాగండి. ముఖ్యంగా మీరు వ్యాపారి అయితే ముందడుగు వేయాలి.


కన్య
మీ ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీరు అనవసర ఖర్చులు చేయవద్దు. ఖర్చులు మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. సాధారణ వ్యక్తిలా ఉండేందుకు యత్నించండి. మీరు చేసిన ఖర్చు వివరాలు రాసుకోండి. అనాలోచిత కొనుగోళ్లు భవిష్యత్తులో ఇబ్బందులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.


తుల
పరిస్థితులను పక్కనపెట్టి హాయిగా ఊపిరి తీసుకుంటారు. మీ సమస్యల గురించి మరచిపోండి. మీ మంచిని అంతా అభినందిస్తారు. ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. తత్ఫలితంగా మీరు కొత్త కోణంలో విషయాలను గమనిస్తారు. ఓపెన్ మైండ్‌గా ఉండాలి.


వృశ్చికం
మీరు సమస్యను పరిష్కరిస్తారు. మీ భుజాలపై ఉన్న భారాన్ని మోయలేరు. అయితే అనవసర సమస్యలను పరిష్కరించడానికి బదులిగా మీ లక్ష్యాలపై ఫోకస్ చేయండి. ఇది మీకు ప్రశాంతం చేకూరుస్తుంది.


ధనస్సు
సాహసోపేత విషయాలను పక్కన పెట్టి, ఈ రోజు మీ పనిపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి నేడు చాలా మంచి రోజు. మీరు ఎదురుచూస్తున్న ఆ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు కోరుకున్న దాని కోసం రిస్క్ చేయాల్సి ఉంటుంది.


మకరం
ఈ రోజు మీ పెత్తనాన్ని పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్నవారికి సహాయంగా ఉండాలి. మీ తెలివితేటలు మరియు అంతర్ దృష్టి మీ కార్యాలయంలో లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు అవసరం కావచ్చు. అంతా మీ అభిప్రాయాన్ని విని, పాటించేలా  చూసుకుంటారు.


Also Read: Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు



కుంభం
మీరు చాలాకాలం నుంచి మీ మనసులో మాటను, లేక రహస్యాలను దాచిపెట్టారా.. అయితే అది వ్యక్తం చేసేందుకు ఇది మంచి తరుణం. ప్రియమైన వ్యక్తితో మీ సమస్యలను పంచుకుంటారు. మీకు సహాయం చేయడానికి మరియు మార్గదర్శకత్వం వహించే సరైన వ్యక్తిని మీరు గుర్తిస్తారు.


మీనం
మీరు శక్తిమేర చాలా ఇస్తున్నారు. ఇది మంచి విషయం. కానీ మీకు విలువ ఇవ్వని వ్యక్తుల కోసం మీ సమయాన్ని మరియు శక్తిని వృథా చేయకండి. మంచివారిని గుర్తించడానికి ప్రయత్నించండి, అలాంటి వ్యక్తులకు సహాయపడటానికి శ్రమించండి.  ఈ రోజు మీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook