Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు

TTD Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆలయాలపై దాడులు ముఖ్య చర్చనీయాంశంగా ఉంది. దీంతో ఆలయాలపై నిఘా పెరుగుతోంది. ఆలయాలు, దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులపై సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 25, 2021, 09:51 AM IST
  • ప్రస్తుతం ఆలయాలపై దాడులు ముఖ్య చర్చనీయాంశంగా ఉంది
  • దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులపై సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు
  • టీటీడీ స్థిర ఆస్తులు పూర్తిగా బోర్డులు మరియు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు

Tirumala Tirupati Devasthanam: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆలయాలపై దాడులు ముఖ్య చర్చనీయాంశంగా ఉంది. దీంతో ఆలయాలపై నిఘా పెరుగుతోంది. ఆలయాలు, దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులపై సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్న ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Latest News) అధికారులు ఆలయానికి చెందిన స్థిర ఆస్తులు ఇప్పుడు పూర్తిగా బోర్డులు మరియు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆలయ జేఈఓ సదా భార్గవి పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, ఇతర విషయాలతో ఆమె అప్రమత్తమయ్యారు.

Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు

జేఈఓ సదా భార్గవి ఇటీవల తిరుమల(Tirumala) ఆలయం ఆస్తులను పరిశీలించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులకు  సరైన ఫెన్సింగ్ లేదని ఆమె గమనించారు. ఈ క్రమంలో టీటీడీ ఆస్తుల వద్ద భద్రతను పెంచడంతో పాటు ఆస్తుల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పెన్సింగ్‌ను సైతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం 

ఇటీవల జేఈఓ సదా భార్గవి ఆదేశాలతో పలు ఆస్తులకు భద్రతా కంచె ఏర్పాటు చేయడం తెలిసిందే. మొత్తంగా 22 ఆస్తులకు బోర్డులు, పెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందులో బైరగిపట్టేడా 8 ఆస్తులు ఉండగా, వైకుంటపురం మరియు ఎంఆర్ పల్లి వద్ద మరో 14 టీటీడీ ఆస్తులున్నాయి.

Also Read: Gold Price Today: మళ్లీ పతనమైన బంగారం ధరలు, పసిడి దారిలోనే దిగొచ్చిన వెండి ధరలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News