Horoscope Today 13 October 2022: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ప్రేమికులకు కలిసొచ్చే కాలం!
Today Astrological prediction for 13 October 2022. కన్య , కుంభ రాశుల వారికి నేడు శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తోంది.
Today Astrological prediction for 13 October 2022: మేషం (Aries): శ్రద్దగా పని చేస్తేనే ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు జాగ్రతగా ఉండాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి ఆరాదిస్తే మంచిది.
వృషభం (Taurus): కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
మిథునం (Gemini): చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీ శత్రువులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది.
కర్కాటకం (Cancer): చేపట్టే పనిలో ఆటంకాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. కనకధారాస్తవం పఠించాలి.
సింహం (Leo): శుభకాలం నడుస్తోంది. మీ బుద్ధి బలంతో పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo): మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనువైన కాలం. కుటుంబంతో కలిసి విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు కలిసొచ్చే కాలం. ఈశ్వరదర్శనం మంచిది.
తుల (Libra): చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నాయి. శ్రద్ధతో మీ పని మీరు చేసుకుపోతే వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio): దైవ బలం ఉంది కాబట్టి పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మంచిది.
ధనస్సు (Sagittarius): నూతనంగా చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.
మకరం (Capricorn): కీలక నిర్ణయాలలో ఆచి తూచి వ్యవహరించాలి. అవసరం అయితే పెద్దల సలహాలు తీసుకోండి. అధిక ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల్లో జాగ్రత్త. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.
కుంభం (Aquarius): చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్ధికంగా బాగుంటుంది. అనవసర ప్రయాణాలు చేయకండి. ప్రేమికులకు కలిసొచ్చే కాలం. కుటుంబంతో జాగ్రతగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధనా మేలు చేస్తుంది.
మీనం (Pisces): చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ప్రయాణ సూచన ఉంది. ఆంజనేయ ఆరాధన చేస్తే మంచింది.
Also Read: Honey trap Case: ఒడిశా ఒగలాడి హనీట్రాప్ ఉచ్చులో రైల్వే ఉన్నతాధికారి ఉన్నారా
Also Read: Flipkart Sale: బోట్, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై డిస్కౌంట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook