Horoscope Today 16 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 16న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఓ విషయంలో మీకు ప్రత్యేకత. దీన్ని మీరు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. మిత్రుల నుంచి ఒత్తిడి. మిమ్మల్ని ఇతరులతో పోల్చడం ఆపండి. ఆలయ దర్శనం. అనుకోని ప్రయణాలు. మీ సొంత మార్గంలో వెళితే అద్భుతాలు జరుగుతాయి.


Also Read: Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు


వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారికి ధనవ్యయం. ఏదీ మీకు సరైనదని అనిపించదు. కొత్త విషయంపై అన్వేషణ. ఎల్లప్పుడూ నూతన ఉత్సాహం. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగాలలో చికాకు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.


మిథున రాశి
మీ ఆలోచనలతో కొంచెం గందరగోళం. తెలిసిన విషయాలపై దృష్టి సారించడం. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు కలిసొస్తాయి. ఈరోజు మీకు వాహనయోగం గోచరిస్తుంది.


కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఆర్థిక సంబంధ పనులలో నిమగ్నం. ఆదాయానికి మించిన ఖర్చు చేస్తారు. కొత్తపరిచయాలతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనుల కోసం ఆహ్వానాలు అందవచ్చు.


Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం


సింహ రాశి
మీరు గుంపుగా పనిచేస్తుంటే ఇతరుల ప్రభావం మీపై అధికం. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దితే, మీకు గౌరవం దక్కకపోవచ్చు. ఇతరులను గౌరవించడం నేర్చుకుంటారు. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.


కన్య రాశి
పని భారం, దూర ప్రయాణాలు చికాకు తెప్పి్స్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ముఖ్యమైన పనులు నిర్వహించడానికి స్నేహితుడిని సాయం కోరతారు. శారీరక శ్రమ. ఉద్యోగులకు అంతగా కలిసిరాదు.


తులా రాశి
మీ మనసు చెప్పిన మాట వింటారు. దీనికి కొంత సమయం పట్టవచ్చు. మీ శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఓపికతో పనులు చేపడితే కార్య జయం. శుభకార్యాలలో పాల్గొంటారు.


వృశ్చిక రాశి
పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో కలతలు, సమస్యలు. పరిష్కార మార్గం కోసం అన్వేషణ. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగం, వ్యాపారాలలో కొన్ని పరిస్థితులు మీకు చికాకు తెప్పిస్తాయి.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


ధనస్సు రాశి
మీరు కోరుకున్న విధంగానే అన్ని జరుగుతాయని మీరు భావిస్తారు. నేడు ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు సైతం వింటారు. మీరు ఏదైనా చేసేందుకు ప్రయత్నాలు కూడా చేయరు. కొత్త ఆశలు చిగురిస్తాయి.


మకర రాశి
నేడు కొంచెం తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు మీ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అధికంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగవు. స్నేహితులు, సన్నిహితులు మీ నుంచి సాయం పొందుతారు. అనారోగ్య సూచన గోచరిస్తుంది.


కుంభ రాశి
ఈ రోజు మీ సలహా కోసం ఎదురుచూపులు. మీ స్నేహితులు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు. నిరుద్యోగులకు కీలక నిర్ణయాలు, మార్పులు.


మీన రాశి
మీరు విశ్వసించే వ్యక్తులపై అధికంగా ఆధారపడ వద్దని తెలుసుకుంటారు. మీరు ఒంటరిగా సైతం ముందుకు వెళ్లాలి. మీ పనులు చేయడానికి కొంత సమయం కేటాయించండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. బంధవులను కలుసుకుంటారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook