Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 19, 2021 Rasi Phalalu, వారికి ప్రమోషన్
Today Rasi Phalalu in Telugu 19 February 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
Horoscope Today 19 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 19న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు మేషరాశి వారికి కార్యజయం. మీకు యోధుల మనస్తత్వం ఉంటుంది. ఈరోజు మీ నుంచి ఎక్కువ ఉత్పాదకత వస్తుంది. మీ ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఆఫీసులో మరియు ఇంట్లో గౌరవిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.
Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు
వృషభ రాశి
మీరు ఈ రోజు మీ స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్తారు. వారి నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీపై వారి నమ్మకం పెరుగుతోంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ సలహాలను చెప్పే ముందు ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి చెప్పాలి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
మిథున రాశి
మీ నిర్ణయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారు. ఈరోజు ఇది మీకు సానుకూలాంశంగా మారనుంది. ఉద్యోగం, వ్యాపారాలలో శ్రమ, ఒత్తిడి అధికం అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కొందరి కారణంగా మీ పనులలో జాప్యం ఏర్పడనుంది. అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరినీ త్వరగా విశ్వసించవద్దు.
కర్కాటక రాశి
మీ సహజ స్వభావాన్ని కొనసాగిస్తారు. ఇతరులను మెప్పించడానికి మీరు ఏది మార్చుకోవలసిన అవసరం లేదు. ఇతరులు మీలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గ్రహించండి. ప్రముఖులతో పరిచయాలు అయ్యే సూచన ఉంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం చేయండి. శారీరక శ్రమతో ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
Also Read: Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు
సింహ రాశి
ఈరోజు సింహరాశి వారు ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లోనే అధిక సమయాన్ని తమకు ఇష్టమైన వారితో గడపనున్నారు. కొన్ని శుభవార్తలు విని కొత్త పనులకు శ్రీకారం చుడతారు. చాలా కాలం అనంతరం మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారి నుంచి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి.
కన్య రాశి
ఇంట్లో పని బాధ్యతలు పెరుగడంతో ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. అధిక ఖర్చులు చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండనుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారు.
తులా రాశి
ఈ రోజు ఉద్యోగం, వ్యాపారాలలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు. మీ బాధ్యతలు సైతం రెట్టింపు అవుతాయి. మీ కృషి ఫలితాన్నిచ్చే దిశగా వెళ్తుండటంతో మీరు సంతృప్తి చెందుతారు. మీ సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అధికం అవుతాయి. తద్వారా కుటుంబంలో పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి.
Also Read: Art of living: రవిశంకర్‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు తెలియని విషయాలు తెలుసుకుంటారు. ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయించండి. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంత మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి
ఈరోజు మీ బాధ్యతలు ఇంటా, బయటా పెరుగుతాయి. కాబట్టి ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి మరియు పనులను పూర్తి చేయండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశం లభిస్తుంది. కుటుంబం, బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమస్యను అధితమించి పనిని పూర్తి చేస్తారు. వెనకడుకు వేసేందుకు మీరు ఇష్టపడరు.
మకర రాశి
పని కారణంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇది మీ కెరీర్‌కు మంచి అవకాశంగా మారనుంది. మీరు చేసిన పనిని వివరించి గుర్తింపు దక్కించుకోవడంలో మీరే ఆసక్తి కనబరచాలి. దైవచింతన అధికం కావడంతో ఆలయాలు సందర్శిస్తారు.
కుంభ రాశి
కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న ఓ స్నేహితుడు సలహాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మరియు వీరు నిష్పాక్షికంగా ఉండటానికి ప్రయత్నించండి. వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు పని భారం అధికం అవుతుంది.
మీన రాశి
మీరు పనిలో కొన్ని మంచి వార్తలను అందుకుంటారు. ప్రమోషన్ లాంటి శుభవార్తలు మీకు ఆనందాన్ని అందిస్తాయి. కుటుంబసభ్యులు మీకు అండగా నిలుస్తారు. సంఘంలోనూ మీకు తగిన గుర్తింపు, గౌరవం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు లేదా ఇతర పనులలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook