Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 25, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం
Today Horoscope In Telugu 25 May 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 25వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 25 May 2021: మే 25వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు మీ కలలు, ఆశయాలు, ఏవైనా ముఖ్య విషయాలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవడానికి తగిన సమయం. మీ చుట్టుపక్కల వారు చేసే కొన్ని పనులు మీరు అసలు ఊహించరు. కొందరు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఆస్తికి సంబందించిన సమస్యలలో కీలక అడుగు పడుతుంది.
వృషభ రాశి
నేడు శుభకార్యాలతో మీరు తీరిక లేకుండా గడుపుతారు. మీరు చేపట్టనున్న ప్రాజెక్టుకు కొంత స్థలం అవసరమని ఇతరులకు చెబుతారు. మీరు చేయాలనుకున్న పనులను స్పష్టంగా వెల్లడిస్తారు. నేడు మీ ఖర్చులు అధికం కానున్నాయి. అయినా వెనకడుకు వేయకుండా పనులు సజావుగా పూర్తి చేస్తారు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
మిథున రాశి
కొంత సమయం సరదాగా గడపటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పనుల కారణంగా కాస్త ఒత్తిడికి లోనవుతారు. స్నేహితులకు బయటకు వెళ్లాలని భావిస్తారు. అందుకు ఇది తగిన సమయం కాదని వేచిచూస్తారు. అనారోగ్య సమస్యలు. ఉద్యోగులకు ఆశించిన మేర ఫలితాలు అందవు.
కర్కాటక రాశి
నమ్మకాన్ని పొందడం తేలిక కాదని భావిస్తారు. నేడు కొందరికి మీ విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. చుట్టుపక్కల వారు మీ అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. ఏ పని చేసినా అధికంగా శ్రమించక తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
సింహ రాశి
కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు అంతగా అవగాహన ఉండకపోవడంతో ఆందోళన చెందుతారు. సాయంత్రానికి పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయాలతో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు పడతాయి.
కన్య రాశి
కొందరు కొత్త వ్యక్తులు మిమ్మల్ని కలుసుకుంటారు. వారితో చెప్పే విషయాల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటల కారణంగా విభేదాలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్య బాధిస్తోంది. అనివార్య కారణాలతో పనులు వాయిదా పడతాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు.
Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు
తులా రాశి
నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ప్రతి పనిలో వేలు పెట్టాలని భావించడం తప్పు అని తెలుసుకుంటారు. కొన్ని విషయాలు మరిచిపోవాలని భావిస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు కావలసిన విషయాలను తెలుసుకుంటారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఇది మీకు చికాకు కలిగించవచ్చు. పనిచేసే ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు. ఖర్చుల కారణంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
గతంలో జరిగిన ఓ సంఘటన మీకు వస్తువు రూపంలో నేడు కనిపించనుంది. పాత జ్ఞాపకాలను గుర్తుకుచేసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. ముఖం మీద చిరునవ్వుతో తిరుగుతూ ఉంటారు. అందువల్ల ఇతరులు మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు మీ కెరీర్ గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలతో మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. అన్ని రంగాల వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
కుంభ రాశి
నేడు కుంభ రాశి వారు కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతారు. కొందరు వ్యక్తుల కారణంగా గత కొన్ని వారాలుగా మీపై ప్రతికూల శక్తి పనిచేస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఇంట్లోనూ, పనిచేసే చోట అదనపు బాధ్యతలు అప్పగిస్తారు.
మీన రాశి
ఈరాశి వారు నేడు శుభవార్తలు అందుకుంటారు. అదే సమయంలో మీ పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వేడుకల కోసం పనిని వదిలివేయడం మంచి నిర్ణయం కాదని భావిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా వేసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook