Horoscope Today: నేడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
Horoscope Telugu: పన్నెండు రాశుల వారికి నేడు (శనివారం) ఎలా ఉందో.. జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.
Horoscope prediction today: నేడు పన్నేండు రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
27 నవంబర్ 2021 (శనివారం)
సూర్యోదయం ఉదయం 6:31 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:35 గంటలకు
తిథి- కార్తీక బహుళ అష్టమి రాత్రి 12:33 గంటల వరకు తదుపరి నవమి
నక్షత్రము: మఘ సాయంత్రం 5:27 గంటల వరకు తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉదయం 6:42 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6:08 గంటల నుంచి 7:42 గంటల వరకు
అమృతఘడియలు: మధ్యాహ్నం 2:58 గంటల నుంచి సాయంత్రం 4:37 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం కోసం ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. సంబధాలు మెరుగవుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి విషయాలు తెలుసుకుంటారు. పిల్లలకు సహాయం అందించడం ద్వారా మంచి విజయం సాధిస్తారు. స్త్రీలకు మనో వేదన ఉండే అకాశముంది. ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఇచ్చే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
వృషభ రాశి (Taurus)
మీ కలుపుగోలు తనం మీకున్న ప్రత్యేకత. దానిని మీ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఉపయోగించడం మంచిది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఎవరికైనా ఏదైనా చెప్పాలనిపిస్తే.. ధైర్యంగా చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశాలు ఉన్నాయి. కళా, సాంస్కృతిక రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి పనులు చేసే వారికి కలిసొస్తుంది. స్నేహితుల ద్వారా మంచి విషయాలు తెలుసుకుంటారు.
మిథున రాశి (Gemini)
ఈ రాశి వారికి రోజంతా ఆశాజనకంగా సాగుతుంది. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే విచ్చలవిడి ఖర్చులు, విలాస జీవన విధానాల వల్ల ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. కుటుంబ విషయంలో నేడు సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాళ్లతో ఎక్కువ సేపు గడిపేందుకే ఇష్టపడతారు. చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి పూట ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. భార్య, భర్తల మధ్య గొడవలు పెరగొచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఆరోగ్యం విషయంలో తీసుకునే నిర్ణయాలకు నేడు మంచి రోజు. కుటుంబ సభ్యుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రశాంతంగా వాళ్లతో కూర్చుని మాట్లాడటం మంచి చేస్తుంది. డబ్బు సంపాదించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంసార జీవితం కాడా సాఫీగా సాగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించడం మేలు చేస్తుంది.
సింహ రాశి (Leo)
పెళ్లైన వాళ్లు భార్య విషయంలో నేడు జాగ్రత్తగా ఉండాలి. ఆమెకు కోపం తెప్పించే విధంగా నడుచుకోవడం ఇబ్బందులకు గురి చేయొచ్చు. డబ్బు విషయంలో ఇబ్బందులు పడొచ్చు. స్నేహితులతో గడిపడం ద్వారా ఉల్లాస పడతారు. మీ తెలివితేటల ద్వారా మెప్పు పొందుతారు. వ్యాపారుల్లో ఒడుదొడుకులు ఉంటాయి. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యసనాల వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంది.
కన్యా రాశి (Virgo)
అనవసర ఆలోచనలు మీ ప్రశాంతతను చెడగొట్టే అవకాశం ఉంది. వ్యాపార, ట్రేడ్ వర్గాల వారికి ధన నష్టం వాటళ్లే అవకాశముంది. ఈ కారణంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరించడం మంచిది. మీ జీవిత భాగస్వామి ద్వారా.. మీకున్న ఇబ్బందులను మరచిపోతారు. నేడు వీలైనంత వరకు ఖాళీ లేకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.
తులా రాశి (Libra)
విశ్రాంతి లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అయితే ఖర్చుల వల్ల ధనం నిలబడదు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవడం ఉత్తమం. స్నేహితులతో సమయం గడపడం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారాలు కొత్త ప్రాజెక్ట్‌లు, ప్లాన్స్‌ను అమలు చేసేందుకు ఇది మంచి రోజు.
వృశ్చిక రాశి (Scorpio)
అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. కానీ డబ్బు విలువను తెలుసుకుంటారు. మీ భార్య విషయంలో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల గొడవకు దారి తీయొచ్చు. చిన్న వ్యాపారస్థులు.. తమ ఉద్యోగులతో సరదాగా గడుపుతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఆర్థిక సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాల వల్ల మంచే జరుగుతుంది. కొంత మందితో మాట్లాడుతూ మీ జీవితాన్ని నెమరు వేసుకునే అవకాశముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మకర రాశి (Capricorn)
నేడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడొచ్చు. పరిస్థితులను చూసి నిరాశకు లోనుకావద్దు. చంచల స్వభావం వీడాలి. మీకు దగ్గరి వారితో కలిసి మాట్లాడటం వల్ల కాస్త ఉల్లాసం పొందుతారు. జీవిత భాగస్వామితో జీవితం సాఫీగా సాగుతుంది. సంఘంలో గౌరహం పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius)
శారీరకంగా, మానసికంగా కాస్త ఇబ్బందుల ఉంటాయి. బద్దకం, క్రమ శిక్షణ లేకపోవడం వల్ల పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. అవమానాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలకు రావచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసర విషయాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
మీన రాశి (Pices)
ఈ రాశి వారు నేడు శుభవార్తలు వింటారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారులు కొత్తవి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వెళ్లికాని వారికి విహహం కుదిరేందుకు అవకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి లభించొచ్చు. భార్యతో గొడవలు తగ్గుతాయి. క్రయ విక్రయాల్లో అనుకూలతలున్నాయి. దీర్ఘ కాలిక గొడవలకు పరిష్కారం లభించొచ్చు.
Also read: Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!
Also read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook