Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!

మీ అరచేతిలో ఉన్న త్రిభుజం ఉన్న ప్రాంతాన్ని బట్టి మీ రాత మారుతుంది తెలుసా..?? ఇలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం.. అదేంటో మీరే చూడండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 06:56 PM IST
  • అర చేతిలో ఉండే రేఖలు మన భవిష్యత్తును తెలియజేస్తాయి
  • త్రిభుజం శని స్థానానికి దగ్గరగా ఉంటే తంత్ర-మంత్రాలలో నిపుణులు అవుతారు
  • త్రిభుజం లోపల ఒక క్రాస్ లైన్ ఏర్పడితే అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది
Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!

Palmistry: పని ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రమాదకర వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. ఇవే కాకుండా.. కరోనా కారణంగా (Corona Crysis) చాలా మందిలో ఆరోగ్య సమస్యలతో పాటు, ఆందోళనలు తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఎవరికైనా.. వారికి భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా..? అని తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా! ఈహతే హస్తరేఖాశాస్త్రం (Palmistry) ద్వారా.. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండబోతుందో.. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలిసే అవకాశం ఉంది. 

చేతిలో ఉండే త్రిభుజం చెప్తుంది 
అరచేతిలో ఉండే ప్రతి రేఖకు వాటి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ముఖ్యంగా అరచేతిలో ఉండే త్రిభుజానికి (Triangle) ప్రాముఖ్యత మరింత విశేషంగా ఉంటుంది. ఈ త్రిభుజం.. అర చేతిలో ఉండే ఏ రేఖకు ఈ త్రిభుజం దగ్గర ఉందో స్థానాన్ని బట్టి కూడా మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు.. 

Also Read: Rakhi Sawant Comments: ఈ నటి విరుష్క జంటకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందట.. ఎందుకంటే..??

1) అరచేతిలో ఉండే శని స్థానానికి (Saturn) ఈ త్రిభుజం దగ్గరగా ఉంటే.. ఆ వ్యక్తులు తంత్ర-మంత్రాలలో (Tantra-Mantra) నిపుణులు అవుతారట. ఒకవేళ ఈ త్రిభుజం చెడిపోతే కనుక... ఆ వ్యక్తి చెడిపోతాడని.. అనగా పోకిరి వెదవలు తయారు అవుతాడని హస్తరేఖాశాస్త్రం చెబుతుంది. 

2) ఒకవేళ ఈ త్రిభుజం గనుక సూర్య స్టానియానికి (Mount of Sun) దగ్గరగా ఉంటే.. దయగల వ్యక్తిగా మారతాడని మరియు మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా కలిగి ఉంటాడని తెలుస్తుంది. ఒకవేళ త్రిభుజం కనుక పాడైతే.. ఆ వ్యక్తి నష్టాల్లో కూరుకుపోతాడని.. విజయం సాధించటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హస్తరేఖాశాస్త్రం చెబుతుంది. 

3) ఒకవేళ ఇదే త్రిభుజం.. ఆయువు రేఖ  లేదా వయసు రేఖకు (Life Line or Age Line) దగ్గరగా ఉంటే.. ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికి ఉంటాడని అర్థం 

4) ఒకవేళ.. త్రిభుజం ఆరోగ్య రేఖపై (Health Line) ఏర్పడి ఉంటే... ఆ వ్యక్తి ఆరోగ్యకర జీవితాన్ని కలిగి ఉన్నాడని అర్థం. ఇలాంటి వ్యక్తులకు ఆరోగ్య సమస్యకు చాలా అరుదు అనిచెప్పవచ్చు. 

5) ఒకవేళ ఈ త్రిభుజం మెర్క్యురీ పర్వతంపై (Mount of Mercury) దగ్గర్లో ఏర్పడితే.. ఆ వ్యక్తి ఒక మంచి శాస్త్రవేత్తగా లేదా వ్యాపారవేత్తగా మారతాడు. ఒకవేళ ఈ త్రిభుజం పాడైతే.. ఆ వ్యక్తి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులన్నీ కోల్పోతాడని అర్థం. 

Also Read: RRR Janani Song: విడుదలైన RRR జనని సాంగ్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న భావోద్వేగాలు..!!

6) అదే సమయంలో, త్రిభుజం లోపల ఒక క్రాస్ లైన్ ఏర్పడితే అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇదే జరిగితే.. ఆ వ్యక్తి వలన ఇతరుల కష్టాలకు కారణమవుతాడు. ఆ వ్యక్తికి దృష్టి సంబంధిత పెద్ద సమస్య ఏర్పడవచ్చు. 

(Disclaimer: ఇక్కడ తెలుపబడిన సమాచారం సాధారణ సమాచారం మరియు ఊహాజనితంపై ఆధారపడి ఉంది. ZEE NEWS Telugu దీనిని ధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

More Stories

Trending News