Horoscope Today 29 November 2022: మేషం (Aries): శుభకాలం నడుస్తోంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): అన్ని రంగాల వారికీ పనిభారం పెరుగుతుంది. అయినా మనో ధైర్యంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.


మిథునం (Gemini): కష్టపడితే అనుకున్నది సాధిస్తారు. ఒక సంఘటన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.


కర్కాటకం (Cancer): శుభకాలం నడుస్తోంది. మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబం, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి సందర్శనం మంచిది.


సింహం (Leo): సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. ధనవ్యయం ఉంది కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టాలి. ప్రయాణం చేస్తారు. సూర్యనారాయణమూర్తి ఆరాధన మంచిది.


కన్య (Virgo): అన్ని రంగాల వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. లాభాలు ఉన్నాయి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దుర్గాస్తోత్రం  చదవాలి.


తుల (Libra): ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. మంచి లాభాలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ దేవి ఆలయ సందర్శనం శుభప్రదం.


వృశ్చికం (Scorpio): మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. అందరితోనూవు చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.


ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం  మంచిది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


మకరం (Capricorn): శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారల్లో శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. ఆదిత్య హృదయం చదివితే మంచిది.


కుంభం (Aquarius): అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ధన లాభం ఉంది. ప్రయాణ సూచన ఉంది. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.


మీనం (Pisces): అన్ని రంగాల వారికీ శుభకాలం. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. 


Also Read: Girl Raped By Headmaster: బాలికపై నలుగురు మైనర్ల గ్యాంగ్ రేప్.. బాధితురాలిని రేప్ చేసి హెడ్ మాస్టర్


Also Read: Obscene Profiles: అమ్మను తిట్టారని మైనర్ ఘాతుకం.. అక్కా చెల్లెళ్ల ఫొటోలతో రెచ్చిపోయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.