Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 8, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Today Horoscope In Telugu: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 8న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 8 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 8న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు విశ్వాసాన్ని మరియు ఆచరణాత్మక ఆలోచనలను ఏకం చేయాల్సి ఉంటుంది. ఏ సమయంలోనైనా ప్రతి ఒక్కరూ మీ అడుగుజాడల్లో నడుస్తారు. సానుకూలంగా ఆలోచించండి, మరియు మీరు ప్రతిదీ ప్లాన్ చేశారని నిర్ధారించుకోండి. నేడు ప్రయాణాలు చేయడంతో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు.
Also Read: Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి
వృషభ రాశి
మీ మీద మీరు కొంచెం నమ్మకం ఉంచాలి. కొన్నిసార్లు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నా పరిస్థితులు మీకు అనుకూలించవు. చుట్టూ ఉన్నవారు మీకోసం నిలబడతారని మీరు గ్రహించాలి. ఉద్యోగులకు ఒత్తిడి అధికం. వ్యాపార రంగాల్లో ఉన్న వారికి పనులలో జాప్యం ఏర్పడుతుంది. నేడు ఈ రాశివారు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.
మిథున రాశి
ఈ రోజు మీ ప్రేమను వ్యక్తం చేసే సమయం. గత కొంతకాలం నుంచి చెప్పాలనుకుంటున్న మనసులో మాటను వారికి చెబుతారు. భయపడవద్దు మరియు ఓపెన్ మైండ్‌గా ఉండాలి. దీని వల్ల మీరు కోరుకున్నది జరుగుతుంది. కొందరు వ్యక్తుల ప్రభావంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే చోట మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు వ్యక్తుల మధ్య సంబంధాలు గురించి తెలుసుకోనున్నారు. దీంతో మీకు విచిత్రమైన అనుభవం కలుగుతుంది. మీకు నేడు వాహనయోగం గోచరిస్తుంది. పనులను జాగ్రత్తగా చేపడుతూ ముందుకు సాగుతారు. అయితే ఏ విషయంలోనూ తప్పిదాలు చేయలేదని, తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని మీ జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా శుభాలే కలుగుతాయి. మీరు కోరుకున్నది నేడు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది
సింహ రాశి
మీరు వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా కొనసాగించాలనుకునే పని సజావుగా సాగదు. మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం అవుతుంది. ప్రణాళిక లేకపోతే పనులలో అవాంతరాలు తప్పవు. దైవచింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. రుణాలు చేయడానికి సిద్ధమవుతారు. దీని కోసం కొన్నిసార్లు ప్రయాణాలు సైతం చేయక తప్పదు.
కన్య రాశి
చాలా భిన్నమైన వ్యక్తులు ఎవరైనా ఈ రోజు మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మీరు వారిపట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలియక ఆశ్చర్యానికి లోనవుతారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. అయితే నూతన అవకాశాల కోసం యత్నిస్తారు. కొందరు వ్యక్తులను కలుసుకుని కెరీర్ గురించి చర్చలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
తులా రాశి
మీరు ఎవరిని కలిసినా వారి నుంచి సలహాలు తీసుకుంటారు, మీరు కోరుకున్నది చేతికి అందనుంది. వాహనయోగం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్, పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి
మీరు కొంతకాలంగా మీ జీవితంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. అయితే, ఇది చేయడానికి మీలో ఉన్న సందేహాలు మరియు ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటేనే ప్రయోజనం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. తద్వారా ఒత్తిడి దూరమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అధికంగా శ్రమించినా పనులలో జాప్యం, అవాంతరాలు తప్పవు.
ధనుస్సు రాశి
ఎప్పటిలాగే మీ చుట్టూ ఉన్నవారికి మీరు కేంద్ర బిందువు అవుతారు. ఇందుకు మీ ఇల్లు, లేదా పనిచేసే చోటు వేదిక కావచ్చు. మీ నుంచి ప్రయోజనం ఉందని తెలుసుకుని చుట్టూ చేరతారు. కొంతకాలం నుంచి మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తే ప్రేమగా వ్యవహరిస్తారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం. వ్యాపారులకు మేలు జరుగుతుంది.
మకర రాశి
మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ రోజు మీకు కావలసిన దాన్ని అందించనుంది. మీరు పని నుండి కొంచెం పరధ్యానంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కోపం, ఆవేశాలకు మీరు దూరంగా ఉండటంతో పనులు ముందుకు సాగుతాయి. ఆఫీసు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. కానీ విశ్రాంతి తీసుకోవాలని మీరు గ్రహిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురవుతాయి.
Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం
కుంభ రాశి
మీకు స్నేహితుడు లేదా కుటుంబసభ్యుడి నుంచి ఇబ్బంది కలుగుతుంటే.. వారికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. మీరు చెప్పకపోతే వారు మీ బాధను అర్థం చేసుకోలేరు. అవతలి వ్యక్తి చెప్పే వివరణ సైతం వినాలి. వాహనయోగం గోచరిస్తుంది. శ్రమించి పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీన రాశి
ఈ రోజు మీ శక్తి అధికమైంది. అయితే జాగ్రత్తగా వ్యవహరించకపోతే సమస్యలు తప్పవు. మీ షెడ్యూల్‌లో కొత్త పనులను చేర్చవద్దు. వాస్తవానికి, ఇప్పటికే ప్లాన్ చేసిన పనులపై ఫోకస్ చేయండి. ఈరోజు మీకు అంతా మేలు జరగనుంది. సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. కొందరు మిత్రులతో ఉన్న విభేదాలు తీరడం మీకు సంతోషాన్నిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook