Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు `రియల్ ఎస్టేట్`కు దూరంగా ఉంటే మంచిది..
Horoscope Today April 23 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉదయం పూట కలిసొస్తే... మరికొంతమందికి మధ్యాహ్నం తర్వాత పనుల్లో వేగం పెరుగుతుంది.
Horoscope Today April 23 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... ఇవాళ కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా, కుటుంబ పరంగా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని రాశుల వారు వృథా ఖర్చులతో ఆర్థికంగా కొంత నష్టపోతారు. ఇలాంటి పలు అంశాలతో ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేషరాశి ( Aries)
పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. ఏ పని మొదలుపెట్టినా మీ అంతరంగాన్ని ఫాలో అవండి. అది మీరు చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగాలంటే మీ అహంకారాన్ని కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. అకడమిక్‌పరంగా విద్యార్థులకు అనుకూల సమయం.
వృషభ రాశి (Taurus)
ఇవాళ ఉదయం పూట ప్రశాంతంగా, సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. మధ్యాహ్నం నుంచి నెగటివిటీ పెరుగుతుంది. అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. వృత్తిపరంగా అది మీ ప్రభావంపై చూపుతుంది. ఇతరులకు అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే అవి తిరిగిరావడం అంత సులువు కాదు. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని మీలోని నెగటివిటీపై దృష్టి పెట్టండి.
మిథున రాశి (GEMINI)
చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఇవాళంతా సంతోషంగా గడుపుతారు. రొమాంటిక్‌గా ఉంటారు. కుటుంబ జీవితంలో ప్రశాంతతను పొందుతారు. మీ ఓపిక వృత్తిపరమైన విషయాల్లోనూ మిమ్మల్ని ది బెస్ట్‌గా నిలుపుతుంది. కొలిగ్స్, వ్యాపార భాగస్వాములతో మంచి సమన్వయం ఉంటుంది. అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు.
కర్కాటక రాశి (Cancer)
అనవసర, వృథా ఖర్చులు మానుకోండి. తద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ తరగకుండా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సింగిల్స్‌కు అనూహ్యంగా పెళ్లి సంబంధాలు రావొచ్చు. ప్రయాణాలు కలిసొస్తాయి. పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సింహ రాశి (LEO)
మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడులు, రిలేషన్‌షిప్‌కు సంబంధించి కీలక నిర్ణయాలకు ఇది అనువైన సమయం కాదు. దంపతులు లేదా లవ్ కపుల్ అనవసర విషయాల్లో వాదనలకు దిగి మనస్పర్థలు తెచ్చుకోవద్దు. విద్యాపరంగా ఎటువంటి షార్ట్‌కట్స్ ఉండవని విద్యార్థులు గుర్తించాలి.
కన్య రాశి (Virgo)
ఇవాళ మీ మనసు చాలా సున్నితంగా, భావోద్వేగపూరితంగా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఇతర ఆస్తుల కొనుగోళ్లకు కూడా ఇది అనువైన సమయం కాదు. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. వాటిని మీరు ఓపికతో పూర్తి చేయాల్సి ఉంటుంది. వృత్తిరీత్యా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడుతారు.
తులా రాశి (Libra)
ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. అది మీ ఆర్థిక పురోగతికి కారణమవుతుంది. మీకున్న నెట్‌వర్క్‌తో అనుకున్న ప్లాన్స్‌ను సులువుగా అమలుచేస్తారు. ఆఫీసులో మీ సిబ్బంది లేదా మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంటుంది. పెద్దల వద్దకు వెళ్లడం లేదా గుళ్లు గోపురాలు తిరగడం చేయవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీ ఎనర్జీ లెవల్ చాలా 'హై'లో ఉంటుంది. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే కాదు.. ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ఎక్కడికైనా వెళ్తారు. విద్యార్థులకు కలిసొస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో గందరగోళంలో పడిపోతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఇవాళ మధ్యాహ్నం వరకు మీకు అంతగా కలిసిరాదు. చేపట్టిన పనులేవీ ఆశాజనకంగా ముందుకు సాగవు. అది మిమ్మల్ని అసంతృప్తికి, నిరాశకు గురిచేస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత పనుల్లో వేగం పుంజుకుంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యే దిశగా అనువైన పరిస్థితి ఉంటుంది. అది మిమ్మల్ని సంతోషానికి గురిచేస్తుంది. కొన్ని కీలక విషయాల్లో నిర్లక్ష్య ధోరణితో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భర్త లేదా భార్యతో ఆత్మగౌరవం విషయంలో పేచీ తలెత్తవచ్చు.
మకర రాశి (Capricorn)
ఖర్చు పెరిగిపోతుంది. అనవసర ఖర్చులు మీ సేవింగ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వృత్తిపరంగా లేదా కుటుంబ జీవితంలో మీ ఆలోచనలను వ్యక్తీకరించడంలో కాస్త జాగ్రత్త అవసరం. ఎదుటి వ్యక్తి నొచ్చుకునే రీతిలో మీ ప్రవర్తన ఉండవద్దు. అది మీపై పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇతరుల నుంచి డబ్బు ఆశించకండి. లేదా అప్పులు చేయకండి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు దూరంగా ఉండండి.
కుంభ రాశి (Aquarius)
సోషల్ గెట్ టు గెదర్ మీకు కలిసొస్తుంది. అది మీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తుంది. గ్లామర్, ఆర్ట్, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యాపరంగా విద్యార్థులు బాగా రాణిస్తారు. లవ్ బర్డ్స్ సంతోష సమయాన్ని గడుపుతారు. అయితే పెళ్లి విషయంలో కాస్త ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి విషయంలో ఇతరుల సలహాలు, సంప్రదింపులను కోరకండి.
మీన రాశి (Pisces)
వృత్తిపరంగా ఇవాళ మీరు చేపట్టిన పనులతో బిజీ బిజీగా గడుపుతారు. పని భారం మిమ్మల్ని కుంగదీస్తుంది. చేపట్టిన పనిని పూర్తి శక్తి సామర్థ్యాలతో చేస్తారు. మీకు పనికిరాని లేదా అవసరం లేని వస్తువులపై ఖర్చులు చేస్తారు. అది మీకు అంత మంచిది కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మర్యాదపూర్వకంగా మెదలాలి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది.
Also Read: DC vs RR: చివరి ఓవర్లో 'నో బాల్' లొల్లి.. ఉత్కంఠ పోరులో ఢిల్లీపై రాజస్థాన్ విజయం!
Also Read: Bhadrachalam Railway Line: భద్రాచలం రాముడి సన్నిధికి కొత్త రైల్వే లైను, ఎక్కడ్నించి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.