Horoscope Today August 25th 2022: ఇవాళ గురువారం. శ్రీమహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు. 'ఓం నమో నారాయణ' మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈ గురువారం ఆ దైవ అనుగ్రహం ఏయే రాశుల జాతకంలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మేష రాశి వారికి ఆర్థికపరంగా ఇవాళ బాగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలకు కొదువ ఉండదు. బిజినెస్ పట్ల ఆసక్తి ఉన్నవారు కొత్త కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల నుంచి అన్నిరకాల సపోర్ట్ లభిస్తుంది. కొన్ని చెడు సహవాసాలు మీరు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయొచ్చు. వాటికి దూరంగా ఉండటం మంచిది. సెల్ఫ్ ఫోకస్ పెరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.


వృషభ రాశి (Taurus)


ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ లేదా రిలేషన్‌షిప్స్‌పై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావొద్దు. మానసికంగా కొంత ఆందోళన ఉండొచ్చు. ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. మీరు ప్రేమించే వ్యక్తులతో విభేదాలు తలెత్తుతాయి. అర్థం లేని వివాదాల్లోకి తలదూర్చవద్దు.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీ ఇంటికొచ్చే అతిథులకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇస్తారు. ఆచార, సాంప్రదాయాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. హ్యాపీనెస్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఆకర్షణీయమైన  ప్యాకేజీతో కూడిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొంతమంది వ్యక్తులతో పరిచయం కలిసిరావొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.


కర్కాటక రాశి (Cancer) 


మీ సహోద్యోగులు మీ ఛరిష్మాకి ఫిదా అవుతారు. మీతో ఇంటరాక్ట్ అయ్యేందుకు వారు ఆసక్తి చూపుతారు. కొన్ని విషయాల్లో మీ ఎమోషన్స్‌ని వ్యక్తపరచలేరు. ఇవాళ ఏ పనిచేపట్టినా చాలా స్పృహతో ఉంటారు. పనిలో మీ ఏకాగ్రతను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు కొత్తగా ఏదైనా అచీవ్ చేసే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం మొదలుపెడుతారు. 


సింహ రాశి (LEO)


ఇవాళ మీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీకు సన్నిహితులుగా భావించే వారి సలహాలు స్వీకరించండి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత ఆందోళన ఉండొచ్చు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేందుకు రుణ  ప్రయత్నాలు చేస్తారు. ప్రొఫెషనల్ రిలేషన్స్ మెరుగవుతాయి. లక్ష్యంగా ఫోకస్ పెరుగుతుంది.


కన్య రాశి (Virgo)


ఇవాళ మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల వ్యాపారాల్లోకి మీరు పార్ట్‌నర్స్‌గా వెళ్లవద్దు. కుటుంబపరంగా ఇవాళ సంతోషకరంగా సాగుతుంది. ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. తల్లిదండ్రుల సలహా వినండి. తోబుట్టువుల ఎమోషన్స్‌ను పట్టించుకోండి. వీలైతే తోబుట్టువులతో కలిసే వ్యాపార కార్యకలాపాలు చేయడం కలిసొస్తుంది.


తులా రాశి (Libra)


ఇటీవల లవ్ బ్రేకప్ అయినవారికి ఇవాళ గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీపై మీరు ఎక్కువ అటెన్షన్‌తో ఉంటారు. కఠినమైన మాటలు సన్నిహితులను దూరం చేస్తాయి. జోక్స్ చేసేటప్పుడు కూడా ఇతరులను నొప్పించే పదజాలం వాడవద్దు. దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


సీనియర్ల సలహాలు, సూచనలు మీకు కలిసొస్తాయి. ఆఫీసులో యంగ్ కొలిగ్స్‌ను మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. మీ పిల్లల కెరీర్ పట్ల చాలా సీరియస్‌గా ఉంటారు. యువత ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయవద్దు. ఉద్యోగ, వ్యాపార పరంగా అంతా సాఫీగా సాగుతుంది. 


ధనుస్సు రాశి (Sagittarius)  


ఆరోగ్యపరంగా ఇవాళ అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. నీరసంగా ఫీలవుతారు. తలనొప్పి, జ్వరం రావొచ్చు. ఆరోగ్యకర డైట్ మాత్రమే తీసుకోవాలి. పొట్ట సంబంధిత సమస్యలను ఈజీగా తీసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడాలి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.


మకర రాశి (Capricorn) 


ఇవాళ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం కలిసొస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. అయితే స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వోద్యోగులకు అనుకూల సమయం. కోర్టు కేసుల్లో మీకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు.


కుంభ రాశి (Aquarius)


అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అది మీకు బిగ్ రిలీఫ్ ఇస్తుంది. మీలో ఇవాళ కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకుని యోగా చేయాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి.


మీన రాశి (Pisces) 


డబ్బు ఖర్చు చేసి కొన్ని వస్తువులేవో కొంటారు. బిజినెస్‌మెన్‌కు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌కి కలిసొస్తుంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. జీవిత భాగస్వామికి కానుకలు ఏవైనా ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  


Also Read: Hyderabad Lathi Charge Video: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి హై టెన్షన్.. బయటికి లాగి మరీ లాఠీచార్జ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook