Horoscope Today August 27th 2022: ఇవాళ శనివారం. శ్రావణ మాసం చివరి రోజు. సాధారణంగా శనివారం నాడు శనీశ్వరుడిని పూజిస్తుంటారు. శని చాలీసా పఠిస్తూ శని దేవుడి అనుగ్రహం కోరితే సత్ఫలితాలు పొందగలరని నమ్ముతారు. భగవాన్ హనుమాన్ ఆశీస్సులు ఉన్నవారి వైపు శని కన్నెత్తి కూడా చూడడు. కాబట్టి శనివారంనాడు హనుమాన్ చాలీసా కూడా పఠిస్తుంటారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళ మధ్యాహ్నం వరకు మీ మూడ్ ఏమీ బాగోదు. అది మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. పెద్దల ఆశీస్సులతో నిరాశ, నిస్పృహ నుంచి బయటకొస్తారు. పనిలో మునుపటి వేగాన్ని అందుకుంటారు. పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతారు. మీ శత్రువులు, ప్రత్యర్థులపై పైచేయి సాధించే అవకాశం ఉంది. కఠిన నిర్ణయాలు తీసుకునేముందు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా వ్యవహరించాలి. కడుపునొప్పి సమస్య రావొచ్చు.


వృషభ రాశి (Taurus)


వర్క్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ముగిసేనాటికి ఏదేని ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బిజినెస్ లేదా ఉద్యోగ రీత్యా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆఫీసులో కొలిగ్స్ సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువుల సక్సెస్‌కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.న్యాయపరమైన అంశాల్లో మీరే పైచేయి సాధించవచ్చు. 


మిథున రాశి (GEMINI)


మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకున్న ప్రధాన బలం. ప్రొఫెషనల్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు చాలా ఉపయోగపడుతాయి. అది మీ పట్ల ఇతరుల్లో గౌరవాన్ని పెంచుతుంది. ప్రేమికులకు అనుకూల సమయం. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. హడావుడి నిర్ణయాలు వద్దు. కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బాగుంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


చంద్రుడి నెగటివ్ ప్రభావం వీడుతుంది. మీలో, మీ చుట్టూ పాజిటివిటీ నిండుతుంది. మీ ఎనర్జీ లెవల్ చాలా హైలో ఉంటుంది. మీ హార్డ్ వర్క్ మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఆత్మగౌరవం మిమ్మల్ని నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉంచుతుంది. మీ వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. 


సింహ రాశి (LEO)


పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. సోషల్ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు. బిజినెస్ పరంగా కొత్త ఇన్నోవేషన్స్‌కి ప్రాధాన్యమిస్తారు. నగదు, బహుమతులు, ఇతరత్రా వస్తువులేవైనా స్నేహితుల నుంచి పొందే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో బాగా రాణించడం మిమ్మల్ని ఖుషీ చేస్తుంది. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు.


కన్య రాశి (Virgo)


చంద్ర అనుగ్రహం ఆర్థికంగా విశేషంగా కలిసొస్తుంది. చిన్న పెట్టుబడే అధిక లాభాలను తీసుకురావడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఊహించని లాభాలతో ఆర్థిక పరిస్థితి అమాంతం ఉన్నత స్థితికి చేరుతుంది. మీలో పనిచేసే సామర్థ్యం మరింత పెరుగుతుంది. తక్కువ కష్టపడినా సక్సెస్ పొందగలరు. న్యాయపరమైన అంశాల్లో మీకే సానుకూలత ఉంటుంది. ప్రత్యర్థులు మీ ఎదుగదులను ఓర్వలేకపోవచ్చు.


తులా రాశి (Libra)


చంద్ర అనుగ్రహం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రాబడి పెరుగుతుంది. వ్యాపారస్తులు దాన ధర్మాలకు ప్రాధాన్యమిస్తారు. అది వారి పట్ల అందరిలో గౌరవాన్ని పెంచుతుంది. బిజినెస్‌లో పార్ట్‌నర్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు తొలగిపోతాయి.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ మీకు సంతోషకర సమయం. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీకున్న నెట్‌వర్క్ మీ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రేమ బంధం మరింత వికసిస్తుంది. ప్రేమ విషయం పెద్దలకు చెప్పేందుకు సిద్ధపడుతారు. క్రియేటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి సరదాగా సినిమాకు వెళ్లే అవకాశం ఉంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


పనిభారంతో మానసిక అలసటకు గురవుతారు. మీలో బద్దకం, పట్టింపులేనితనం పెరుగుతుంది. ఎప్పుడూ సహనంతో ఉండటం అలవరుచుకుంటారు. అడ్వెంచర్ టూర్స్‌ ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలు తీసుకొస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నడుం నొప్పి, చర్మ, కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.


మకర రాశి (Capricorn) 


మీలో క్రియేటివిటీ చాలా 'హై'లో ఉంటుంది. ఇంటికి మరమత్తులు చేపట్టే ఆలోచన చేస్తారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ముఖ్య విషయాల్లో ఆమె లేదా అతని సలహా స్వీకరిస్తారు. కొత్తగా పెళ్లయినవారు ఏకాంతంగా గడిపేందుకు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. పెద్దల ఆశీర్వాదంతో ఏ కష్టాలు ఎదురవ్వవు. 


కుంభ రాశి (Aquarius)


మీ ఖర్చులకు,సంపాదనకు బ్యాలెన్స్ కుదురుతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. తోబుట్టువులు లేదా బంధువులు మీ ఇంటికి వస్తారు.అంతా కలిసి సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. మీలో భక్తి భావం పెరుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. సాయం కోరినవారికి కాదనకుండా తోచిన మేర చేయూతనిస్తారు.


మీన రాశి (Pisces) 


ఇవాళంతా నిరాశజనకంగా సాగుతుంది. నిద్రలేమితో యాక్టివ్‌నెస్ తగ్గిపోతుంది. మీ లక్ష్యంపై ఏకాగ్రత చెదురుతుంది. చేపట్టిన పని సాఫీగా సాగదు. తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతారు. మీవల్ల బాధపడినవారిని క్షమాపణ కోరుతారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Bigg Boss Telugu season 6: కంటెస్టెంట్స్ లిస్టు లీక్.. ఎవరెవరు ఉన్నారంటే?


Also Read: DRDO CEPTAM Recruitment 2022: కేవలం డిగ్రీ, పదో తరగతి ఉత్తీర్ణతతో భారీ వేతనం పొందే జాబ్స్.. దరఖాస్తులకు డెడ్ లైన్ ఎప్పుడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook