DRDO CEPTAM Recruitment 2022: కేవలం డిగ్రీ, పదో తరగతి ఉత్తీర్ణతతో భారీ వేతనం పొందే జాబ్స్.. దరఖాస్తులకు డెడ్ లైన్ ఎప్పుడంటే..

DRDO CEPTAM Recruitment 2022:  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కి చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (DRDO-CEPTAM)లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ, టెక్నీషియన్-ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 26, 2022, 02:24 PM IST
  • డీఆర్డీవో సెప్టమ్ రిక్రూట్‌మెంట్
  • 1901 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
DRDO CEPTAM Recruitment 2022: కేవలం డిగ్రీ, పదో తరగతి ఉత్తీర్ణతతో భారీ వేతనం పొందే జాబ్స్.. దరఖాస్తులకు డెడ్ లైన్ ఎప్పుడంటే..

DRDO CEPTAM Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కి చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (DRDO-CEPTAM)లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ, టెక్నీషియన్-ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1901 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 3 2022 నుంచి సెప్టెంబర్ 23, 2022 లోపు డీఆర్డీవో అధికారిక వెబ్‌సైట్  drdo.gov.in.లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి విద్యార్హత, వయోపరిమితి, వేతనం, విద్యార్హత తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఖాళీల వివరాలు :

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ : 1075 పోస్టులు
టెక్నీషియన్-ఏ : 826 పోస్టులు

ముఖ్య తేదీలు : 

దరఖాస్తుల స్వీకరణ తేదీ - సెప్టెంబర్ 3, 2022
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - సెప్టెంబర్ 23, 2022

విద్యార్హతలు, వయో పరిమితి :

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ : ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్,టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

టెక్నీషియన్-ఏ : ఏదేని బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ :

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ : టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)-స్క్రీనింగ్ టెస్ట్; టైర్ 2 (సీబీటీ)-సెలక్షన్ టెస్ట్

టెక్నీషియన్-ఏ : సెలక్షన్ టెస్ట్ ; టైర్ 2 ట్రేడ్/స్కిల్ టెస్ట్ 

వేతనం : 

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ పోస్టులకు పే లెవల్ 6 (రూ.35,400-రూ.1,12,400) వేతనం చెల్లిస్తారు.

టెక్నీషియన్-ఏ : పోస్టులకు పే లెవల్ 2 (రూ.19,900-రూ.63,200) వేతనం చెల్లిస్తారు.

Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

Also Read: NEET UG Result 2022 : నీట్ పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్ తేదీ ప్రకటించిన ఎన్‌టీఏ.. ఆన్సర్ కీ ఎప్పుడంటే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News