Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 01 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం
Horoscope Today In Telugu 01 July 2021: మీ ఆర్థిక పరిస్థితి నేడు మెరుగవుతుంది. నిజంగా అవసరం ఉన్న వస్తువులు, సర్వీసుల కోసం నగదు వెచ్చించడం ద్వారా నష్టమేమీ లేదు. నేడు మీ పని సజావుగా సాగుతుంది. తల్లిదండ్రులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కొంత ఉపశమనం కలుగుతుంది.
Horoscope Today In Telugu 01 July 2021: మేష రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత పనులతో తీరిక లేకుండా గడుపుతారు. ఈ రోజు వివాహం గురించి మాట్లాడటానికి తగిన సమయం. మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.
వృషభ రాశి
మీ సంస్థాగత నైపుణ్యాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. మీరు చేసిన కృషికి ప్రతిఫలం లభిస్తుందని ధీమాగా ఉంటారు. ఇంట్లోని సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రతిదీ పరిష్కరించడానికి సమయం కావాలి మరియు అవకాశాలు అందుకు తగిన విధంగా ఉండాలని ఓపిక పడతారు. నేడు ఆకస్మిక ధనలాభం ప్రాప్తించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
మీ కుటుంబ సమస్యలతో నేడు సరదాగా సమయం గడుపుతారు. గతంలో నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఒప్పిస్తారు. సినిమాలు, లేదా షాపింగ్ లాంటి పనులకు సమయాన్ని కేటాయిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఉదయం నుంచి కొంచెం తక్కువ అనే భావనలో ఉంటారు. కానీ ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. మీరు అదనపు ఆదాయ కోసం చూస్తున్నట్లయితే స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల మధ్య కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.
సింహ రాశి
మీరు ఈరోజు నూతనోత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. గతంలో మీకు రావాల్సిన నగదు నేడు చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు సైతం నేడు దూరం కానున్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని, గట్టిగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు తమ ఉన్నత చదువు గురించి ఆలోచిస్తారు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కన్య రాశి
నేడు ఇంటి సమస్యలతో సతమతమవుతారు. మీరు ఇంటికి వచ్చిన తరువాత ప్రశాంతంగా వ్యవహరించాలి. నోరుజారితే సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. పిల్లల చదువు గురించి భార్యాభర్తల మధ్య గొడవలు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి చేతికి రానుంది. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.
తులా రాశి
నేడు మీకు అంతా గందరగోళంగా అనిపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం ఉత్తమం. మీ కెరీర్‌పై ఎక్కువ దృష్టిసారిస్తారు. కొందరు వ్యక్తులు మాటల ద్వారా మాయ చేసి అనుకున్నది సాధించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్టపడి పనిచేసే వారికి ప్రతిఫలం దక్కుతుంది.
వృశ్చిక రాశి
మీ ఆర్థిక పరిస్థితి నేడు మెరుగవుతుంది. నిజంగా అవసరం ఉన్న వస్తువులు, సర్వీసుల కోసం నగదు వెచ్చించడం ద్వారా నష్టమేమీ లేదు. నేడు మీ పని సజావుగా సాగుతుంది. తల్లిదండ్రులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రయాణాలకు దూరంగా ఉంటే మీ కుటుంబానికి ప్రయోజనం.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
ధనుస్సు రాశి
మీరు కొత్త ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే అందుకోసం అన్వేషణకు నేడు తగిన సమయంగా కనిపిస్తుంది. లేదా నిర్మాణాలు చేపట్టాలని సైతం ఆలోచిస్తారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు పదే పదే మార్చుకోవడం ద్వారా మీకు చిక్కులు తప్పవు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
మకర రాశి
ఈరోజు ఏ పని చేసినా మీకు గుర్తింపు లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి, మీతో మర్యాదగా వ్యవహరిస్తారు. మీ ఆరోగ్యం సైతం మెరుగవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. కొంతకాలం తరువాత మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడుపుతారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభ రాశి
కుంభరాశి వారు నేడు కొత్త అభిరుచిని ఎంచుకుని, అందులోనే కొనసాగాలని మీ మనసు కోరుకుంటోంది. మరోవైపు పని నుంచి కాస్త విరామం తీసుకుని మీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించండి. చాలా రోజుల తరువాత ఓ స్నేహితుడు లేదా బంధువుతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతారు. అధికంగా శ్రమించడం ద్వారా అనారోగ్య సమస్యలు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం.
మీన రాశి
మీరు ఈ రోజు మీ కుటుంబంతో కొంత సమయం గడపాలని అనుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు మీ తలుపుతడతాయి. మీరు నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. స్టాక్స్ మరియు షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి నేడు తగిన సమయం. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook