Horoscope Today 17 June 2021: మేష రాశి
నేడు మీరు ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.  ఇతరులు అసూయపడేలా ఈ రోజును ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో వెనక్కి లాగడానికి చాలా మంది యత్నిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
మీరు సాధారణంగా పట్టుదలతో వ్యవహరిస్తారు. మీ పనులే మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రేమ, అనురాగం అనే బలహీనత మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. సాధారణంగా మీరు నిరాశతో ఉంటారు. లేదా ప్రమాదాల బారిన పడుతుంటారు. ఉద్యోగులు అవసరమైతే పని నుంచి కాస్త విరామం తీసుకోవాలి. ప్రయాణాలపై మరోసారి ఆలోచించాలి.


Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?


మిథున రాశి
ఈరాశి ప్రతి సందర్భంలోనూ కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించినా,  పరిస్థితులను అర్థం చేసుకుని ముందడుగు వేస్తారు. పనిని కొనసాగించే సందర్భంలో ఏమాత్రం కలవరపడకండి. కొన్ని శుభవార్తలు అందుతాయి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.


కర్కాటక రాశి 
బంధుత్వం అనేది ఓ సంబంధం మాత్రమే, అయినప్పటికీ వ్యక్తులు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని వారికి గుర్తు చేస్తారు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఓ ప్రమాదం మీకు పొంచి ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. 


సింహ రాశి
మీ చుట్టూ ఉన్న కొందరు తప్పుగా ప్రవర్తించవచ్చు, లేదా గతంలో చేసిన తప్పులను కొనసాగిస్తారు. వారికి తప్పు తెలియచేస్తూ హెచ్చరించే సమయం ఇది. ప్రయాణాలు చేసే ముందు ఇతరులకు విషయాన్ని చెప్పి సలహా అడుగుతారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. ఉద్యోగులకు పనిచేసే చోట తగిన గుర్తింపు లభిస్తుంది. 


కన్య రాశి
మీరు తెలివైన మరియు మంచి వ్యక్తిగా వ్యవహరిస్తారు. కనుక చాలా మంది మిమ్మల్ని అభిమానిస్తారు. మిమ్మల్ని తరచుగా కలుసుకుని పలు విషయాల గురించి చర్చిస్తుంటారు. ఓ విషయంలో కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. పనులు పూర్తి చేయడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. 


Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 


తులా రాశి
గతంలో జరిగిన విషయాలను మరిచిపోవాలి. మరింత ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుని వ్యవహరించాలి. స్థిరపడటం, కెరీర్ మార్చుకోవడం లాంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  విద్యార్థులకు పరీక్షలపై భయాలు నెలకొంటాయి. ఉద్యోగం చేసే చోట మీకు ఏది సముచితమో అర్థం చేసుకుని వ్యవహరించాలి.


వృశ్చిక రాశి 
ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీరు ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది తగిన సమయంగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.


ధనుస్సు రాశి
గత కొన్నిరోజులుగా తీరిక లేకుండా పనిచేస్తున్నందున అలసిపోయినట్లు అనిపిస్తుంది. కనుక పని నుంచి ఈరోజు కాస్త విరామం తీసుకుంటారు. ఇప్పటివరకు మీరు సాధించిన వాటిపై దృష్టి పెట్టండి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించి ధ్యానం చేయాలి. వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి.


మకర రాశి
నేడు ఆరోగ్యంపై ఫోకస్ చేయాలి. రుచికరమైన కాకుండా ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకోవాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. మరోవైపు ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సందేహిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కొంతకాలం పాత విషయాలనే కొనసాగించాలి.


Also Read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?


కుంభ రాశి
మీరు పారదర్శకంగా వ్యవహరిస్తారు. దానివల్ల చుట్టూ ఉన్నవారికి మీపై విశ్వసనీయత పెరుగుతుంది. మీరు వాస్తవికతకు మరియు జరిగిన విషయాలకు కట్టుబడి ఉంటారు. ఇతరుల సాయాన్ని కోరడానికి పునరాలోచించాలి. నేడు ఏదైనా వస్తురూపంలో కానుకలు పొందుతారు.


మీన రాశి
మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఆకుకూరలు ఉండే వంటలు తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  స్పష్టమైన వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి. శారీరక శ్రమ చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. కొన్ని విషయాలలో ధనలాభం పొందుతారు. గతంలో మొదలుపెట్టిన పనులపై ఫోకస్ చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook