Horoscope Today July 16th 2022: ఇవాళ శనివారం. హిందువులు శ్రీ వేంకటేశ్వరస్వామి లేదా శని దేవుడిని పూజిస్తారు. శనివారం శని దేవుడిని పూజించడం ద్వారా కష్టనష్టాల నుంచి బయటపడుతామని నమ్ముతారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళంతా ఆఫీసులో పనితోనే గడిచిపోతుంది. మీకున్న నెట్‌వర్క్ సాయంతో అనుకున్న వ్యూహాలను విజయవంతంగా అమలుచేస్తారు. పెట్టుబడుల విషయంలో మీ చతురత లాభాలు తీసుకొస్తుంది. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. అది మీ వైవాహిక బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమికులు తమ ప్రియుడు లేదా ప్రియురాలితో ఎక్కువ సమయం గడుపుతారు.


వృషభ రాశి (Taurus)


కొన్ని పనులకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. అవి సత్ఫలితాలనిస్తాయి. కెరీర్‌లో పురోగతి కోసం ఉన్నత విద్యకు ప్లాన్ చేస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. తోబుట్టువులతో ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీకు ఏదీ కలిసిరాదు. అసంతృప్తి, నిరాశ వెంటాడుతాయి. ఎంతటి నిరాశలోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. కోపాన్ని ప్రదర్శించవద్దు. చేపట్టిన పనులకు సంబంధించి హడావుడి నిర్ణయాలు పనికిరావు. వీలైతే సన్నిహితుల సలహా కోరండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆధ్యాత్మికత ద్వారా కొంత మానసిక ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న అసంతృప్తి ఎగిరిపోతుంది. ఇప్పుడు మీలో సంతోషం వెల్లివిరుస్తుంది. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. గతంలో వాయిదా వేయబడ్డ ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేస్తారు. మీ తోబుట్టువుల సాయంతో కొంత వెంచర్స్ ప్లాన్ చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.


సింహ రాశి (LEO)


మీ ముక్కుసూటితనాన్ని అదుపులో ఉంచుకంటే మంచిది. అన్ని విషయాల్లో ముక్కుసూటిగా వెళ్లడం సత్ఫలితాలను ఇవ్వదు. ఎప్పుడూ వాగుడుకాయలా ఏది పడితే అది మాట్లాడవద్దు. ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. ఖర్చులు ఎక్కువై సేవింగ్స్‌ తగ్గుతాయి. ఏ నిర్ణయమైనా ఓపికగా ఆలోచించి, వీలైతే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.


కన్య రాశి (Virgo)


ఉద్యోగ లేదా వ్యాపారంలో మీకు అప్పగించిన బాధ్యతలను సులువుగా నిర్వర్తిస్తారు. కొన్ని టాస్క్‌లు ఇట్టే పూర్తి చేస్తారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అయితే అత్యుత్సాహ ధోరణి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదు. అనవసర విషయాల్లో, వివాదాల్లో తలదూర్చి డిస్టర్బ్ కావొద్దు. అది మీ విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.


తులా రాశి (Libra)


ఇవాళ మిమ్మల్ని నిరాశ కమ్మేస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. పెట్టుబడులకు పూర్తిగా ప్రతికూల సమయం. వ్యాపార విస్తరణ కొద్దిరోజులు వాయిదా వేసుకుంటే మంచిది. లేనిపక్షంలో నష్టాలను చవిచూస్తారు. ఇదివరకు వచ్చిన లాభాలు కూడా నష్టాల దెబ్బకు ఎగిరిపోతాయి. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.


వృశ్చిక రాశి (Scorpio)


చంద్ర అనుగ్రహం మీలో సంతోషం నింపుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా దక్కుతుంది. మీ సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం కొత్త పెట్టుబడులు ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


పనిలో మీ పెర్ఫామెన్స్ బాగుంటుంది. సీనియర్లు మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. ఉద్యోగ విషయంలో కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ ఉండొచ్చు. న్యాయపరమైన విషయాల్లో గుడ్ న్యూస్ వింటారు. మీ శత్రువులు, ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ జోలికి రారు. మీ పురోగతి వారికి అసూయ కలిగించినప్పటికీ.. మీకు దూరంగా ఉండిపోతారు.


మకర రాశి (Capricorn) 


ఇవాళ విధి మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతీ పని సక్సెస్ అవుతుంది. మేదోపరమైన లేదా సాంస్కృతికపరమైన అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. అవివాహితులైన సింగిల్స్‌కి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. పెళ్లి విషయంలో ప్రేమికులు కీలక నిర్ణయం తీసుకుంటారు.


కుంభ రాశి (Aquarius)


పాత అప్పులు ఇంకా తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరే నిందించుకుని నిరాశకు గురవుతారు. చిన్న చిన్న తప్పులకు గిల్టీగా ఫీలవుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బందిపెడుతాయి. రోజంతా చికాకుగా గడుపుతారు. వ్యక్తిగత జీవితంలో జీవిత భాగస్వామి కారణంగా కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. ఆమె లేదా అతని సలహాలు మీకు సత్ఫలితాలనిస్తాయి.


మీన రాశి (Pisces) 


మీ ఏకాగ్రత లక్ష్యం వైపే ఉంటుంది. ఏ పనిచేసినా అది మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుందా లేదా అనే ఆలోచనతో ఉంటారు. కొత్తగా పెళ్లయినవారు జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Bhadrachalam Godavari Floods LIVE*: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు


Also Read: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.