Sushmita Sen Net Worth: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?

Sushmita Sen Net Worth and remuneration details. నివేదికల ప్రకారం సుస్మితా సేన్ సంవత్సరానికి దాదాపుగా రూ. 9 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 15, 2022, 09:18 PM IST
  • లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్
  • మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా
  • ప్రస్తుతం లండన్‌లో ఎంజాయ్‌
Sushmita Sen Net Worth: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?

Sushmita Sen Net Worth and Remuneration details: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇందుకు కారణం ఆమె భారత టీ20 లీగ్ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీతో డేటింగ్ చేయడమే. 46 ఏళ్ల సుస్మితా.. 56 ఏళ్ల మోదీతో లేటు వయసులో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి ప్రస్తుతం లండన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. 

1975 నవంబరు 19న హైదరాబాదులో సుష్మితా సేన్‌ జన్మించారు. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్‌కాగా.. తల్లి శుభ్రా సేన్ ఫ్యాషన్, నగలు డిజైనర్. సుష్మితా హైదరాబాదులో జన్మించినా విద్యాభ్యాసం పూర్తిగా ఢిల్లీలో సాగింది.

1994లో 18వ యేట సుష్మితా సేన్‌ విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్శించారు. ఆపై మోడలింగ్ చేసి సినిమాలోకి వచ్చారు.  హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో ఆమె నటించారు. తెలుగులో రక్షకుడు సినిమాలో మెరిశారు. 

నివేదికల ప్రకారం సుస్మితా సేన్ సంవత్సరానికి దాదాపుగా రూ. 9 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. దాదాపు రూ.74 కోట్ల నికర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని వెర్సోవాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉంటున్నారు.

సుష్మితా సేన్‌ వద్ద పలు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ 730 LDని కూడా ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 1.42 కోట్లు. కోటి రూపాయల విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6 కారు కూడా ఉంది. ఇక సుష్మితా ఒక సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటారట. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 1.5 కోట్లు తీసుకుంటారని సమాచారం.

సుస్మితా సేన్‌ ఇదివరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో  డేటింగ్‌ చేశారు. అయితే కొన్ని కారణాలతో వాళ్లిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇప్పుడు లలిత్‌ మోదీతో డేటింగ్ చేస్తున్నారు. 

Also Read: Vaani Kapoor Pics: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో.. అందాల ట్రీట్ ఇచ్చిన వాణీ క‌పూర్!

Also Read: Andhra Bride Video: కోనసీమలో భారీ వరదలు.. పడవలో వరుడి ఇంటికి చేరిన వధువు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News