Horoscope Today June 18th 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రోజు గ్రహాల సంచారం రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతోంది. ఈరోజు శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. ఈ ప్రభావం ఆయా రాశుల వారిపై పడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏయే రాశుల వారి జాతకంలో ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)


 తొందరపాటు పనికిరాదు. ఏ పనినైనా తెలివిగా చేయాలి. హోటల్ రెస్టారెంట్ వ్యాపారులు తమ ఉత్పత్తి నాణ్యతపై శ్రద్ధ వహించాలి. యువత అలసత్వం వహించడం మంచిది కాదు.సోమరితనం యువత శ్రమకు తూట్లు పొడుస్తుంది, కష్టపడి పని చేస్తూనే ఉండాలి. తోబుట్టువులు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఓపికగా ఉండాలని వారికి సలహా ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది.ఇతర రోజుల కంటే శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటారు. పెద్దలకు ఎదురు సమాధానాలు చెప్పవద్దు. ఎవరితో మాట్లాడినా ఓపిక, సంయమనం అవసరం.


వృషభ రాశి (Taurus)


తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి సొంతంగా ముందుకు సాగాలి. పెద్ద నెట్‌వర్క్‌తో మీకు ఎక్కువ లాభం వస్తుంది. పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు, దాని ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. విద్యార్థులు విద్యారంగంలో మంచి ప్రతిభ కనబరిచి, ప్రణాళికాబద్ధంగా చదువును పూర్తి చేయాలి.
క్షణికావేశం వల్ల రోజంతా మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. చల్లటి పదార్థాలను తినవద్దు. ఎందుకంటే ఇది మీకు హాని కలిగిస్తుంది. మీ ఆఫీసు పని సజావుగా చేయండి. అందరితో ప్రేమగా మెలగండి.


మిథున రాశి (GEMINI)


ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నారికి మరో చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇనుము వ్యాపారం చేసే వారు ఈరోజు మంచి లాభాలు పొందుతారు, ఇతర వ్యాపారాలు సాధారణ వేగంతో సాగుతాయి. యువత కష్టమైన పనిని సైతం సులువుగా పూర్తి చేస్తారు. యువత తమ శక్తిని అర్థవంతమైన పనుల్లో ఉపయోగించాలి. ఇంటి పనులు పెండింగ్‌లో ఉంటే.. పెండింగ్‌లో ఉన్న ఆ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కళ్లలో మంట, నొప్పి సమస్యలు రావొచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ పరిచయాలు మరింత విస్తృతమవుతాయి.


కర్కాటక రాశి (Cancer) 


టార్గెట్ బేస్డ్ వర్క్ చేస్తున్న వ్యక్తులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్ వ్యాపారం చేసే కొంతమందికి ఈ రోజు ప్రతికూలం. ఇతరుల పని సాధారణంగా ఉంటుంది. యువత తమ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. వారి సహాయంతో, సమస్యలు పరిష్కరించబడతాయి. ఆహారాన్ని మితంగా తీసుకోండి. బరువు పెరుగుతున్నట్లయితే వెంటనే జాగ్రత్తపడండి. బరువు పెరగడం వ్యాధులను ఆహ్వానిస్తున్నట్లే. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి, దొంగతనం జరిగే అవకాశం ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అల్మారాలు, తలుపులకు సరిగ్గా తాళం వేసిన తర్వాతే వెళ్లాలి.


సింహ రాశి (LEO)


సైనిక విభాగానికి సంబంధించిన వ్యక్తులు బదిలీ అవుతారు. వ్యాపారస్తులు ఏదైనా ఆర్థిక సంస్థ లేదా బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే.. వెంటనే రుణం అందుతుంది. అపజయాలు ఎదురైనా నిరాశ, నిస్పృహ వంటి వాటి నుంచి బయటపడాలి.తల్లితండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, వారి అవసరాలు అడిగి, మందులు తదితరాలు అయిపోతే, ముందుగానే తీసుకురండి. ఆస్తమా రోగులు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణం కారణంగా వ్యాధి మళ్లీ తిరగబెట్టవచ్చు. ఎవరైనా మీ సహాయం కోరి వస్తే.. వారిని నిరాశపరచవద్దు.


కన్య రాశి (Virgo)



ఈ రాశి వారికి కెరీర్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, అనవసరంగా ఆలోచనలు పక్కన పెట్టండి. వ్యాపారంలో అహంకారం పని చేయదు. యువకులు పదునైన ప్రతిచర్యలకు దూరంగా ఉండాలి. అది సామాజికంగా మంచి ప్రభావం చూపదు. ప్రియమైనవారితో డబ్బు విషయంలో పారదర్శకత పాటించాలి, పారదర్శకత లేనప్పుడే గందరగోళం ఏర్పడుతుంది. చిన్న జబ్బు అయినా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి చిన్న వ్యాధిని నిర్లక్ష్యం చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యమైన పని చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, మనస్సుకు ఆటంకం కలిగితే, ఆ పని సరిగా చేయలేరు.


తులా రాశి (Libra)


కళలు, మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు కస్టమర్లతో మంచిగా ప్రవర్తించాలి, వారితో అనుబంధాన్ని ప్రదర్శించాలి. కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యువత ఏది చేయాలనుకున్నా, నిండు మనసుతో, ఆత్మ తృప్తి కోసం చేయండి. కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహకరించవలసి ఉంటుంది, కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకోవాలి.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా డ్రైవర్‌ పక్కన కూర్చున్నప్పుడు, వాహనం వేగాన్ని గమనించండి. అతివేగంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి, మిమ్మల్ని రెచ్చగొట్టి మీ పేరు చెడగొట్టాలని చూసేవారు ఉంటారు.


వృశ్చిక రాశి (Scorpio)


సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇవాళ టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు మహిళా కస్టమర్లను బాధించవద్దు, వారి పట్ల గౌరవం వ్యాపారంలో మీకు లాభాలను పొందడానికి పని చేస్తుంది. యువతకు శుభవార్త అందుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడం వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి, సామాజికంగా మీ ఇమేజ్ బాగుండాలని ఉద్దేశంతో అవసరం లేకపోయినా మీ జ్ఞానాన్ని చాటుకునే పనులు చేయకండి.


ధనుస్సు రాశి (Sagittarius)  


ధనుస్సు రాశి వ్యక్తులు అధికారిక పనిని మరింత మెరుగ్గా చేయడానికి, వారి పని శైలిలో మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగులతో సత్ప్రవర్తనను కొనసాగించండి, వారు సంతోషంగా ఉంటే వ్యాపారాన్ని పెంచడంలో వారు మీకు బాగా సహకరిస్తారు. యువతకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది,. కుటుంబ సభ్యులతో మీ మనస్సును పంచుకోండి. పిల్లలకి మార్గనిర్దేశం చేయాల్సి రావొచ్చు. మీ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండండి. వారితో కొన్ని కబుర్లు చెప్పండి. బయట ఎక్కడికైనా వెళ్లే వారు ఇన్‌ఫెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. 


మకర రాశి (Capricorn) 


ఈ రాశిచక్రంలోని వ్యక్తులు ఉన్నత అధికారుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇది వారి వృత్తికి ఉపయోగపడుతుంది. వ్యాపారంలో లాభాలు రాకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు కామన్. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత విజయం సాధించవచ్చు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ ప్రతీ ప్రయాణంలో ప్రతిచోటా ఆనందం ఉంటుంది. మలబద్ధకం సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. మీ ఆహారంలో ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించడంలో పాలుపంచుకోండి. 
 


కుంభ రాశి (Aquarius)


కుంభ రాశి వారికి సహోద్యోగులతో పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీపడండి కానీ అది మిమ్మల్ని అసూయగా మార్చనివ్వవద్దు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు అలాంటివేమీ చేయవద్దు. లేనిపక్షంలో నష్టం ఉండవచ్చు. ఏదైనా సృజనాత్మక పనిలో పెట్టుబడి పెట్టండి.ఒకరి రాక ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది, ప్రియమైన వారి రాకతో, మంచి ఆతిథ్యం ఇవ్వబడుతుంది. జలుబు సమస్య ఉంటే, వెంటనే చికిత్స పొందండి, లేకపోతే సమస్య తీవ్రమవుతుంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.


మీన రాశి (Pisces) 


ఈ రాశిచక్రం వ్యక్తులు సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి సలహాలను పొందుతారు. ఇది కెరీర్ పురోగతికి మార్గం ఏర్పరుస్తుంది. కొత్త వ్యాపారాన్ని స్థాపించే వ్యాపారులు లాభాలు రాని సందర్భంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఏది చేసినా ఓపికతో చేయండి. యువత వారి మెరుగైన పనితీరు కారణంగా ఆఫీసులో ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. స్నేహితుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు, సమస్యల్లో చిక్కుకుంటే స్నేహితుల సహకారం తీసుకోవాలి.



Also Read: Agnipath Row : రాకేష్ మృతికి నిరసనగా టీఆర్ఎస్ బంద్.. మోడీ దుర్మార్గం వల్లే చనిపోయాడని కేసీఆర్ ఫైర్  


Also Read: Gold Price Today: పైపైకి పసిడి.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర ఉందంటే..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.