Horoscope Today June 4th 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం... ఉద్యోగ విషయంలో కొన్ని రాశుల వారికి బదిలీ జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తవచ్చు. ఆర్థిక స్థితి విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి ( Aries)


ఈరోజు మీకు సాధారణ రోజు కానుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ జరగవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి రోజు. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. 


వృషభ రాశి (Taurus)


మానసికంగా తెలియని కలవరం వెంటాడుతుంది. డబ్బు దుబారా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఆఫీస్ పనుల్లో అదనపు బాధ్యతలు చేపడుతారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేనిపక్షంలో నష్టం తప్పకపోవచ్చు. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.


మిథున రాశి (GEMINI)


మీ మాటలు, ప్రవర్తన సమాజంలో మీకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకొస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు లాభాల కోసం కష్టపడాల్సి రావచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీరు విద్యాపరమైన పనుల కోసం అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ప్రేమలో ఉన్నవారు లవ్‌మేట్‌తో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ కొన్ని శుభవార్తలతో మీ రోజు ప్రారంభమవుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గతంలో పలువురు వ్యాపారవేత్తలకు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. లవ్‌మేట్‌తో మాట్లాడుతున్నప్పుడు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకపోతే అనవసర వివాదాలు ప్రేమ బంధంపై ప్రభావం పడుతుంది.



సింహ రాశి (LEO)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. మీ తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి అనుకోని సర్‌ప్రైజ్ పొందే అవకాశం ఉంటుంది.


కన్య రాశి (Virgo)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళవచ్చు. లవ్‌మేట్ వైపు నుంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. పెళ్లి విషయంలో తర్జనభర్జన పడవద్దు. పెద్దల ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుంది.


తులా రాశి (Libra)


ఈరోజు ప్రారంభంలో కొన్ని శుభవార్తలు అందుతాయి. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. జీవిత భాగస్వామి మనసు నొప్పించే పనులు చేయవద్దు.


వృశ్చిక రాశి (Scorpio)


ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గోప్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. లేని యెడల తెలిసినవారే మీకు ద్రోహం తలపెట్టవచ్చు. వాహనం లేదా ఇల్లు కొనుగోలుకు ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. లవ్‌మేట్‌తో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. మీ పాత స్నేహితుడు ఒకరిని కలిసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అనవసర విషయాలకు జోలికి వెళ్లకపోవడం మంచిది.


మకర రాశి (Capricorn) 


ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు.


కుంభ రాశి (Aquarius)


ఈ రోజు మీరు రోజు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కారణంగా కొంత కలత చెందుతారు. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కోగలరు. అంతేకాదు, చట్టపరమైన వివాదాల్లో ఇరుక్కోవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రతీ అడుగు ఆచీ తూచీ వేయాలి.


మీన రాశి (Pisces) 


ఇవాళ కొన్ని శుభవార్తలతో మీ రోజు ప్రారంభమవుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి చూపుతారు. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికుల కారణంగా కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.


Also Read: Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...  


Also Read: Horoscope Today June 4th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి అనుకోని సర్‌ప్రైజ్...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook