Horoscope Today June 5th : నేటి రాశి ఫలాలు... ఆ రాశికి చెందిన అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావొచ్చు..
Horoscope Today June 5th 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి నిరాశజనకమైన ఫలితాలు ఉంటాయి.మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today June 5th 2022: నేటి రాశి ఫలాల ప్రకారం... ఇవాళ కొన్ని రాశుల వారికి సన్నిహితులు, పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారికి అత్తమామల నుంచి ఖరీదైన బహుమతులు అందవచ్చు. పలు రాశుల వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కలిసొస్తుంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఇంకా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
ఈ రోజు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిలో ఆటంకాలు మానసికంగా కుంగదీస్తాయి. అయినప్పటికీ మీరు ఓపికగా ముందుకు సాగాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయండి. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో నిరాశ ఉండవచ్చు. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఎలాంటి ప్రత్యేకతలు ఉండకపోవచ్చు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. లవ్‌మేట్ నుంచి మీకు శుభవార్త అందవచ్చు.
మిథున రాశి (GEMINI)
ఇంటి పనుల్లో మరింత బాధ్యతగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, మద్దతు పొందుతారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు.విద్యాపరమైన పనిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
దోష పరిహారానికి కుటుంబసమేతంగా పూజా క్రతువులు చేస్తారు. వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు. సోదరుల సహకారంతో ధన లాభం ఉంటుంది. అత్తమామల వైపు నుంచి బహుమతులు అందుకునే అవకాశం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సరదాగా గడిపేందుకు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు.
సింహ రాశి (LEO)
ఏ పని పూర్తయినా మనసుకు ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో మరిన్ని బాధ్యతలు మీద పడుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. లవ్‌మేట్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకుంటారు.
కన్య రాశి (Virgo)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. మీరు చేపట్టే పనుల్లో స్నేహితుల మద్దతు పొందుతారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీరు వేసే ప్రతీ అడుగులో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
తులా రాశి (Libra)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో మీకు మంచి జరుగుతుంది. పెండింగ్ పనులు కొన్ని చకచకా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. సన్నిహితుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉండొచ్చు. త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడి ఆర్థికంగా బలపడుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనుల పట్ల మొగ్గు చూపుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావచ్చు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్య లేదా భర్త మనసు నొప్పించే ప్రవర్తనను మార్చుకుంటే మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేపట్టే పనుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేనిపక్షంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటారు. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లవ్‌మేట్ నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందే ఛాన్స్ ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ పొరుగువారు మీ పురోగతిని చూసి అసూయపడతారు. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవడం మానుకోండి. ప్రేమ జంటల్లో ఏదో ఒక విషయంలో టెన్షన్ ఉంటుంది. వ్యాపారంలో విస్తరణకు ఈరోజు అనుకూలమైన రోజు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి (Pisces)
మీరు ఈరోజు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అత్తమామల వైపు నుంచి బహుమతి అందుకోవచ్చు.
Also Read: Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?
Also Read: యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12 మంది మృతి.. చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook