Horoscope Today June 9th 2022: ఇవాళ వృషభ, కర్కాటక, వృశ్చిక రాశి వారికి శుభవార్తలు అందుతాయి. సింహ, కన్య, మకర తదితర రాశుల వారికి ఇవాళ పూర్తి అనుకూలంగా ఉంటుంది. చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. రెండు రాశుల వారు.. తమ ప్రేమ బంధంలో అనుకోని ట్విస్టులు ఎదుర్కొంటారు. ఇవాళ ఏయే రాశులకు ఇంకా ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మేషరాశి ( Aries)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో బదిలీ లేదా కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. లవ్‌మేట్‌తో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పెద్దగా ఆందోళన కలిగించే విషయాలేవీ లేవు.


వృషభ రాశి (Taurus)


ఈరోజు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. తద్వారా కుటుంబంలో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. మీ పాత స్నేహితుడు ఒకరిని చాలా రోజుల తర్వాత కలిసే అవకాశం. ప్రేమ బంధంలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. విద్యార్థులకు ఈరోజు శుభదినం.


మిథున రాశి (GEMINI)


ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆఫీసులో అధికారుల సహాయంతో పదోన్నతి లభిస్తుంది. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. ఈరోజు పెట్టిన పెట్టుబడులు వ్యాపారంలో లాభాలు తీసుకొస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కెరీర్‌పై దృష్టి పెట్టాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి నైట్ డిన్నర్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. విద్యాపరమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈరోజు పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.


సింహ రాశి (LEO)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయాల్లో గందరగోళం, ఉరుకులు పరుగులు తప్పవు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలమైన రోజు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. లవ్‌మేట్‌తో ఎక్కువ సమయం గడుపుతారు. పెళ్లికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది.


కన్య రాశి (Virgo)


ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఇవాళ చేపట్టే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. వ్యాపార విస్తరణకు ఇది చాలా మంచి రోజు. జీవిత భాగస్వామి సహకారంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది.


తులా రాశి (Libra)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు రావచ్చు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ కొన్ని శుభవార్తలు అందుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు అందడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేకపోతే వివాదాలు చుట్టుముడుతాయి. లవ్‌మేట్‌తో ఏదో విషయంలో వివాదం రావచ్చు. ఓపికగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఆఫీస్ పనుల్లో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. వ్యాపారులు డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. సాయంత్రం లవ్‌మేట్‌తో వాకింగ్‌కు వెళ్లే అవకాశం.


మకర రాశి (Capricorn) 


చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు దుబారా చేయవద్దు. వాహనాన్ని నెమ్మదిగా నడపండి. ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి అనుకూలమైన రోజు.


కుంభ రాశి (Aquarius)


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కోగలరు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో మోసం జరగవచ్చు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.


మీన రాశి (Pisces) 


వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఈరోజు విద్యార్థులు కొన్ని సంతోషకరమైన వార్తలను అందుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. స్నేహితులతో ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ బంధంలో కొత్త ట్విస్ట్ ఎదురవుతుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు ఈరోజు మంచి వివాహ సంబంధం రావొచ్చు.


Also Read: TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ


Also Read: Shama Sikander Bikini Pics: బికినీలో రెచ్చిపోయిన షామా సికిందర్.. మొత్తం చూపించేస్తుందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook