Horoscope Today March 8 2022: మేషం ( Aries): ఓ శుభవార్త వింటారు. ఇంటికి సంబంధించి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. శ్రమను నమ్ముకొని ముందుకు సాగండి. ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.


మిథునం (Gemini): ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ఇతరుల సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో కలిసి బయటికి వెళతారు. లక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం.


కర్కాటకం (Cancer): కీలక పనుల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రయాణాలు చేస్తారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచిది.


సింహం (Leo): పట్టు వదలకుండా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. అనవసర కష్టాలను కొని తెచ్చుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.


కన్య (Virgo): బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు చెప్పే మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. వాయిదా వేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.


తుల (Libra): మంచి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.


వృశ్చికం (Scorpio): మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. ఊహించని ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.


ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బంది పడతారు. దుర్గాధ్యానం మంచి ఫలితాలు ఇస్తుంది.


మకరం (Capricorn): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సహాయం అందుతుంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది.


కుంభం  (Aquarius): మీమీ రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి . దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.


మీనం (Pisces): దైవబలం సంపూర్ణంగా ఉంది. మానవ ప్రయత్నం చేయాలి. నిర్ణయాలు మార్చుకుంటే ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. దుర్గా అష్టోత్తరం మంచిది.


Also Read: Legislature vs Judiciary: అసెంబ్లీలో అమరావతి హైకోర్టు తీర్పుపై కీలక చర్చ, శాసనసభ వర్సెస్ న్యాయవ్యవస్థలో ఎవరిది పైచేయి


Also Read: Megastar Chiranjeevi: సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook