Magh Purnima 2022: హిందూ మతంలో పౌర్ణమి, అమవాస్యలకు ప్రత్యేక స్థానముంది. అందులోనూ మాఘ పూర్ణిమకు (Magh Purnima) ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. అంతేకాకుండాదానం చేయడం, ధ్యానం చేయడం ద్వారా వారు అనుకున్నది సిద్ధిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాఘ మాసం ముగిసే చివరి రోజునే మాఘ పూర్ణిమ అంటారు. మరుసటి రోజు నుంచి ఫాల్గుణం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మాఘ పూర్ణిమ (Magh Purnima 2022) ఫిబ్రవరి 16న (బుధవారం) వచ్చింది. ఈ రోజున కొన్ని నియామాలు పాటిస్తే..మీ ఇంట్లో లక్ష్మీదేవి (Goddess Laxmi) ఉంటుంది. అంతేకాకుండా మీకు ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. 


ఈ సమయంలో దానం చేయండి..


మాఘ పూర్ణిమ రోజున స్నానమాచరించి దానం చేయడానికి అనువైన సమయం ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 09:42 నుండి రాత్రి 10:55 వరకు. తలస్నానం చేసిన తర్వాత మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ సమయంలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే రాహు కాలం మధ్యాహ్నం 12:35 నుండి 01:59 వరకు ఉన్నందున ఈ గంటన్నరలో శుభకార్యాలు చేయకండి.


మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే..
>> మాఘ పూర్ణిమ నాడు లక్ష్మి దేవికి 11 గవ్వలను సమర్పిస్తే...ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు లేదా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవచ్చు. 
>> గోవులకు బొట్టు పెట్టి పూజించాలి. మరుసటి రోజు గోవుకు ఎర్రటి వస్త్రం కట్టి, సంపద ఉన్న ప్రదేశంలో ఉంచండి. కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
>> మాఘ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవిని పూజించి, ఆమెకు ఖీర్ సమర్పించండి. లక్ష్మీ మంత్రాన్ని జపించండి.
>> మాఘ పూర్ణిమ నాడు ఉదయాన్నే తలస్నానం చేసి మర్రి చెట్టుకు నీళ్ళు పోసి పూజించాలి. లక్ష్మిదేవి మీ కష్టాలన్నింటినీ తొలగిస్తుంది.
>> లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలన్నా లేదా శాశ్వతంగా ఉండాలన్నా..మాఘ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి..తులసిచెట్టును పూజించాలి. సాయంత్రం దీపారాధన చేయాలి. 


Also Read: Eclipses in India: 2022లో రాబోయే గ్రహణాలు.. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతాయంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Linkhttps://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook