Eclipses in India: 2022లో రాబోయే గ్రహణాలు.. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతాయంటే?

Eclipses in India: 2022 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహణాలు ఏఏ దేశాల వారిపై ప్రభావం చూపుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 02:32 PM IST
Eclipses in India: 2022లో రాబోయే గ్రహణాలు.. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతాయంటే?

Eclipses in India 2022: ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. జోతిష్య శాస్త్రాన్ని పాటించే వారు గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. 2022 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. 

గ్రహణాలు ఎప్పుడెప్పుడు సంభవిస్తాయి?

1) సూర్య గ్రహణం: ఈ ఏడాదిలో మొదటిగా రాబోయేది సూర్య గ్రహణం. ఇది ఏప్రిల్ 30 2022న మధ్యాహ్నం 12:15 నుండి 04:07 వరకు కనిపిస్తుంది. ఇది పాక్షిక గ్రహణం. ఈ సూర్య గ్రహణం నైరుతి అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించని కారణంగా.. జోతిష్య శాస్త్రం ఆ రోజును గ్రహణంగా భావించడం లేదు. 

2) చంద్ర గ్రహణం: ఈ ఏడాదిలో రాబోయే రెండో గ్రహణం చంద్ర గ్రహణం. ఇది మే 16న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఉదయం 07.02 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఇది కూడా జోతిష్య శాస్త్రం ప్రకారం చెల్లుబాటు కాదు. ఈ చంద్ర గ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కిటికా, హిందూ మహాసముద్రంలో గ్రహణం కనిపిస్తుంది.

3) చంద్ర గ్రహణం: 2022లో రాబోయే మూడో గ్రహణం చంద్ర గ్రహణం. ఇది అక్టోబరు 25న సంభవిస్తుంది. ఇది కూడా పాక్షిక చంద్ర గ్రహణం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 04.29 నుంచి 05.42 వరకు ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా భారతదేశంలో కనిపించదు. 

4) సూర్య గ్రహణం: 2022లో ఏర్పడనున్న చివరి గ్రహణమిది. నవంబరు 8న సంభవించనున్న ఈ సూర్య గ్రహణం.. మధ్యాహ్నం 01.32 నుంచి రాత్రి 07.27 వరకు సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం. భారతదేశంలోనూ ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. భారతదేశంతో పాటు.. ఆగ్నేయ ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలోనూ ఈ గ్రహణాన్ని చూడవచ్చు.  

Also Read: Hanuman Chalisa Rules: హనుమాన్ చాలీసా జపించే వారు ఈ తప్పులు చేయకండి!

Also Read: Horoscope Today 9th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News