These 3 Signs Peoples Will face huge problems till February 27 due to Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... 'బుధుడి'ని గ్రహాల రాకుమారుడు అంటారు. జ్ఞానం, వైభవం మరియు అందం యొక్క ప్రదాతగా బుధుడు పరిగణించబడ్డాడు. బుధుడు ఎప్పుడైతే తన రాశి చక్రాన్ని మారుస్తాడో.. అప్పుడు పలు రాశుల వారికి అదృష్టం మేల్కొంటుంది. అదేసమయంలో కొన్ని రాశుల వారికి  చెడు రోజులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27 వరకు బుధ, శని గ్రహాలు మకర రాశిలో ఉంటాయి. దీని కారణంగా ఈ 3 రాశుల వారికి సంక్షోభం తప్పదు. ఆ 3 రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం: 
బుధుడు సంచారం 2023 కారణంగా కుంభ రాశి ప్రజలు ఆరోగ్య సంబంధిత నష్టాన్ని ఎదుర్కొంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎముకల వ్యాధికి సంబంధించిన సమస్య ఉండవచ్చు. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయంలోనైనా ఒకేసారి పెద్ద నిర్ణయం తీసుకోకండి. తప్పు సహవాసానికి దూరంగా ఉండండి.


మీనం:
బుధ సంచారంలో (బుధ గోచారం 2023) మీన రాశిపై సంక్షోభం ఉంటుంది. ఈ రాశి వారి ఆదాయంతో పోల్చితే.. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఇంటి ఖర్చులు కూడా కష్టం. పిల్లల చదువుల వైపు నుంచి టెన్షన్ ఉంటుంది. ఇరుగుపొరుగు వారితో గొడవలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుని సంయమనంతో వ్యవహరించడం మంచిది. 


మకరం: 
బుధ సంచారం 2023 వలన మకర రాశి వారు కొన్ని చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో గొడవలు రావచ్చు. రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. ఏ పని చేయాలని అనిపించదు. మీ హృదయం అన్ని సమయాలలో పరధ్యానంగా ఉంటుంది. ఈ చెడు సమయం నుంచి బయటపడేందుకు యోగా చేయండి. సంగీతాన్ని వినండి. ఇంటి పెద్దలతో ఎక్కువ సమయం గడిపితే మంచిది.


Also Read: Chetan Sharma Sting Operation: ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్.. టీమిండియా ప్లేయర్స్ సంచలన విషయాలు బయటపెట్టిన చేతన్ శర్మ!  


Also Read: Chetan Sharma Sting Operation: జస్ప్రీత్ బుమ్రా గురించి సంచలనం విషయం బయటపెట్టిన టీమిండియా చీఫ్ సెలక్టర్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.