Indira Ekadashi 2023: ఇందిరా ఏకాదశి ఎప్పుడు? శుభ సమయం, వ్రత ప్రాముఖ్యత తెలుసుకోండి
Lord Vishnu: హిందూ మతంలో ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పితృపక్ష సమయంలో వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ పూర్వీకులకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
Significance of Indira Ekadashi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశి రోజున ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఈ ఏకాదశి అక్టోబర్ 10న అంటే మంగళవారం వస్తుంది. హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పూర్వీకుల మోక్షానికి ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మన పూర్వీకుల పాపాలు తొలగిపోయి యమ లోకం నుండి విముక్తి పొంది స్వర్గప్రాప్తి పొందుతారని నమ్ముతారు.
శుభ సమయం
ఈ ఏకాదశి తేదీ అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:36 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 3:08 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం, అక్టోబరు 10న ఏకాదశి ఉపవాసం ఉంటారు. అక్టోబరు 11న ఉదయం 06:19 నుండి 08:38 వరకు పారణ సమయం ఉంటుంది. ఈ రెండు గంటల్లోనే భక్తులు వ్రతం పూర్తి చేసుకోవాలి.
వ్రతాన్ని ఎలా చేయాలి?
ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకుని శ్రీమహావిష్ణువును(శాలిగ్రామ స్వామి) పూజించాలి. అనంతరం పూర్వీకులకు శ్రాద్ధం చేయడంతోపాటు తర్పణాలు వదలాలి. అనంతరం బ్రహ్మాణులకు నైవేద్యం సమర్పించాలి. తర్వాత రోజు పూజానంతరం దానం చేసి పారణ చేయాలి. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు యమలోకం నుండి విముక్తి పొంది.. స్వర్గలోకాన్ని చేరతారని ప్రతీతి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook