Ithr Benefits: హిందూమతంలో పూజాది కార్యక్రమాల్లో అత్తరు ఉపయోగం ఎక్కువే. ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైనది. అటు మనం కూడా బాడీకు, బట్టలకు రాస్తుంటాం. అయితే అత్తరు ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మతపరమైన కార్యక్రమాల్లో దేవతల ప్రసన్నం కోసం అత్తరు ఉపయోగిస్తుంటారు. అటు లక్ష్మీదేవి, హనుమంతుడికి కూడా అత్తరు చాలా ఇష్టం. కానీ జీవితంలో ఎదురయ్యే చాలా ససమ్యలను దూరం చేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో పలు మార్గాలు, పద్ధతులు సూచించారు. ఇందులో పర్ఫ్యూమ్ లేదా అత్తరు ఒకటి. అత్తరు ఉపయోగంతో సంబంధిత వ్యక్తి జీవితం కుదుటపడుతుందట. 


అత్తరు దేనికి ఉపయోగించాలి


వైవాహిక జీవితంలో మాధుర్యం తీసుకొచ్చేందుకు బుధవారం రోజు మూడు గంటలు సదరు భార్య మౌనవ్రతం ఉండాలి. దాంతోపాటు శుక్రవారం నాడు చేతిలో పాయసం చేసి..భర్తకు, కుటుంబసభ్యులకు తిన్పించాలి. పాయసం పట్టికబెల్లంతో చేయాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు అత్తరు దానం చేస్తే మంచిది. దీనివల్ల భార్యాభర్తల సంబంధం పటిష్టమౌతుంది. 


మంగళవారం నాడు హనుమానా చాలీసా చదివేటప్పుడు అత్తరు ఉపయోగించాలి. దాంతోపాటు హనుమంతుడి సమక్షంలో సంపెంగ నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత హనుమంతుడిని గులాబీపూల మాల ధరించి..రెండు భుజాలకు అత్తరు రాయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆదా అవుతుంది.


కుండలిలో శుక్రగ్రహం ప్రభావాల్ని శుభసూచకంగా మార్చేందుకు పర్ఫ్యూమ్ లేదా అత్తరు ఉపయోగం మంచిది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అత్తరు, శృంగార వస్తువుల్ని కానుకగా ఇవ్వడం వల్ల ప్రేమ, ధనం సమృద్ధిగా లభిస్తుంది. శుక్రగ్రహం శుభఫలాల్ని ఇస్తుంది. 


ఆర్దిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు ఇంట్లో ధనవృద్ది కోసం ఏదైనా నెలలో శుక్లపక్షంలో బ్రౌన్ కలర్ పర్స్ కొనాలి. ఏదైనా నాలుగు నోట్లు తీసుకుని..వాటిపై చందనపు అత్తరు రాసి లక్ష్మీదేవి వద్ద ఉంచాలి. ఆ తరువాత లక్ష్మీదేవి పూజ చేసి వాటిని బ్రౌన్ కలర్ పర్సులో ఉంచుకోవాలి. దీనివల్ల ధన సంబంధిత సమస్యలు దూరమౌతాయి. 


Also read: Jyeshtha Purnima 2022: స్త్రీలు అఖండ సౌభాగ్యం పొందాలంటే.. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ వ్రత కథ చదవండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook