Jyeshtha Purnima 2022: ఈ ఏడాది జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం జూన్ 14న వచ్చింది. ఈ రోజున స్నానం, దానం, పూజలకు ప్రత్యేక విశిష్టత ఉంది. వట్ పూర్ణిమ (Vat Purnima 2022) వ్రతాన్ని మధ్య మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజున పాటిస్తారు. ఈ వ్రతాన్ని భర్త దీర్ఘాయువు మరియు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం వివాహితులు చేస్తారు. ఈ రోజున వట్ చెట్టు, సావిత్రి మరియు సత్యవాన్‌లను పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతం వట్ సావిత్రి వ్రతంగా ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం కథ
పురాణం ప్రకారం, రాజర్షి అశ్వపతి కుమార్తె పేరు సావిత్రి. తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానం. సావిత్రికి దమ్‌సేన్ కొడుకు సత్యవాన్‌తో వివాహం నిశ్చయమైంది. అప్పుడు నారదుడు అశ్వపతికి సత్యవాన్ పెళ్లయిన ఏడాది తర్వాత చనిపోతానని చెప్పాడు. అది విని రాజర్షి అశ్వపతి.. కూతురు సావిత్రిని వేరే వరుడిని ఎన్నుకోమని కోరాడు. కానీ దానికి సావిత్రి ఒప్పుకోలేదు. దీంతో సావిత్రికి సత్యవాన్‌కు వివాహమైంది. ఆమె తన భర్త సత్యవాన్ మరియు అతని తల్లిదండ్రులతో కలిసి అడవిలో నివసించడం ప్రారంభించింది.
కాలజ్ఞానం ప్రకారం, సత్యవాన్ జీవితంలో చివరి రోజు వచ్చినప్పుడు, సావిత్రి కూడా అతనితో పాటు కలప నరకడానికి అడవికి వెళ్లింది. సత్యవాన్ చెట్టు ఎక్కడం ప్రారంభించాడు, అప్పుడే అతని తలలో విపరీతమైన నొప్పి వచ్చింది. దిగి వచ్చి మర్రిచెట్టు కింద సావిత్రి ఒడిలో పడుకున్నాడు. ఇంతలో సత్యవాన్ ప్రాణాలను తీయడానికి వచ్చిన యముడిని చూసింది. తన భర్త ప్రాణాలను తీయడానికి వీల్లేదని అడ్డుపడింది. సత్యవాన్ తో పాటు సావిత్రి కూడా యమలోకానికి వెళ్లింది. అప్పుడు ఆమెకు యమధర్మరాజు 3 వరాలు ఇచ్చాడు. ఈ 3 వరాలలో సావిత్రి సత్యవాన్ యొక్క 100 మంది కుమారులకు తల్లి అయ్యే వరం కూడా కలిగి ఉంది.
సత్యవాన్ మళ్లీ బ్రతికి ఉన్నప్పుడే ఈ వరం ఫలిస్తుంది. యమరాజ్ తన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. అతను సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. సత్యవాన్ మళ్ళీ లేచాడు. అప్పటి నుండి, వివాహిత స్త్రీలు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ నాడు వట్ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు, తద్వారా వారి భర్తలు కూడా దీర్ఘాయువు కలిగి ఉంటారు మరియు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు.
Also Read: Vat Purnima Vrat 2022: వట్ పూర్ణిమ వ్రతం ఎప్పుడు? దీనిని ఎందుకు చేస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook