Unknown Facts About Puri Jagannath Rath Yatra 2023: ప్రతి సంవత్సరం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్రను చూడడానికి ప్రపంచంలోని నలుమూలనుంచి భక్తులు తరలి వస్తారు. ఈ సంవత్సరం జగన్నాథుని రథయాత్ర ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరానికి ఈ రథయాత్రను ప్రారంభించి 146 సంవత్సరాలు పూర్తయిందని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ రథయాత్రలో భాగంగా శ్రీహరి పూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు ఆలయంలోని గర్భగుడిలో ఏడాది పొడవునా పూజలందుకున్న శ్రీకృష్ణుడు ఆషాడమాసంలో రథయాత్రలో భాగంగా భక్తులకు దర్శనం ఇస్తాడు. అయితే ప్రతి సంవత్సరం రథయాత్రను ఘనంగా జరపడానికి కారణాలేంటో? ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ సాంప్రదాయం ప్రకారం.. జగన్నాథుని సోదరులు బలభద్ర, సోదరి సుభద్ర ఆషాడ మాసంలోని శుక్లపక్షం రెండవ తేదీన అత్తారింటికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం జగన్నాథుడి సోదరుడు సోదరీమణి కోసం రథాలను తయారుచేసి ఘనంగా ఉత్సవాల మధ్య వారిని అత్తారింటికి పంపుతారు. ముందుగా ఈ యాత్రలో భాగంగా బలభద్రుని రథం బయలుదేరుతుంది. ఆ తర్వాత బలభద్రుని వ్రతం వెనకాల ఆమె సోదరి సుభద్ర రథం బయలుదేరుతుంది. ఇలా చివరిన జగన్నాధుని రథంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ సంవత్సరం జగన్నాథుని రథయాత్ర జూన్ 20న ప్రారంభమై జూలై 1న ముగుస్తుంది.


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య


రథయాత్రను ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
పద్మ పురాణాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. జగన్నాథున్ని ఆయన సోదరి ఒకసారి నగరం మొత్తాన్ని చూడాలని కోరుకుంటుంది. అప్పుడు జగన్నాథుడు ఆమె కోరిక మేరకు నగరాన్ని అంతా చూపించడానికి రథంపై బయలుదేరుతాడు. ఇలా ప్రతి సంవత్సరం జగన్నాథుడు రథంపై తన సోదరిని నగరాన్ని చూపిస్తూ వచ్చాడు. దీంతో ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. నారద పురాణం ప్రకారం.. యాత్రలో భాగంగా జగన్నాథుడు తన తోబుట్టువులకు తీపి వంటకాలను తినిపించడం కారణంగా వారు అనారోగ్య సమస్యలకు గురవుతారు. వారికి వైద్యం అందించి ఆరోగ్యవంతులైన తర్వాతే రథయాత్రలో భాగంగా దర్శనమిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.


రథయాత్ర ప్రత్యేక తేదిలు:
✽ జూన్ 20: జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అవుతుంది.
✽ జూన్ 24:హేరా పంచమి.
✽ జూన్ 27: సంధ్యా దర్శనం.
✽ జూన్ 28: బహుద యాత్ర.
✽ జూన్ 29: సునభేసుడు.
✽ జూన్ 30: దేవతలను నైవేద్యం సమర్పిస్తారు.
✽ జూలై 1: జగన్నాథుని రథయాత్రలో చివరి ఘట్ట.


Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌న్యూస్, ఉద్యోగుల జీతం 26 వేలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook