Janmashtami 2022: భారత్‌లోని హిందువులకు కృష్ణాష్టమి చాలా పవిత్రమైన రోజు.. శ్రీకృష్ణున్ని హిందూ పురాణాల ప్రకారం విష్ణువు 8 వ అవతారమని నమ్ముతారు. కృష్ణుడు మధురలోని బృందావనంలో జన్మించాడు. దీంతో అక్కడ జన్మాష్టమికి ముందే పూజలు ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ వేడుకలు భారతదేశం వ్యాప్తంగా జరుపుకోవడం విశేషం.. శ్రీకృష్ణుడు గోపికలతో  బృందావనం చేసిన సందడులకు గాను గోకులాష్టమిని జరుపుకుంటారు. అయితే ఈ పండగ విశిష్ట ప్రస్తుతం చాలా మందికి తెలియదు.. ఈ రోజూ మనం ఆ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జన్మాష్టమి ప్రాముఖ్యత:
శ్రీకృష్ణుడు ఆగష్టు మాసంతోని అష్టమి రాత్రిన మధురలో జన్మించాడు. అయితే కృష్ణాష్టమి రోజునా హిందువులు ఉపవాసం ఉండి.. వేకువత జామున శ్రీకృష్ణుని పూజిస్తారు. ఈ పూజలో భాగంగా స్వామికి పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా ఉత్తర భారత్‌లో చాలా మంది భక్తులు ఊయల కట్టి స్వామి విగ్రహాన్ని అందులో పడుకోబెట్టి పాటలు, కీర్తనలు వినిపిస్తారు.


ఉట్ల పండుగ:
భారతదేశం వ్యాప్తంగా వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి.. యువకులు, పెద్దలు పోటీపడి ఉట్లను తెంపేందుకు ప్రయత్నిస్తారు. జన్మాష్టమి పడుచు యువకులకు గొప్ప పండగని శాస్త్రం పేర్కొంది. దక్షణ భారతదేశంలో ఈ పండగని ఉట్ల పండుగ అంతే.. ఉత్తర భారత్‌ వ్యాప్తంగా  ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. పండగ రోజున స్వామివారికి చాలా చోట్ల పులిహోర నైవేద్యంగా పెడతారు. అయితే హిందూ సాంప్రదాయల ప్రకారం.. ఇంట్లో స్త్రీలు శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పేర్కొంది. ద్వాపరయుగంలో జన్మించిన స్వామి రక్షసుల నుంచి ప్రజలను రక్షించడానికి ఎంతో కృషి చేయడం వల్ల నేటి కలియుగానికి ఆదర్శ మహనీయుడుగా నిలుస్తున్నారు. అయితే ఈ కారణంగానే అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తారని హిందూ పురాణాలు పేర్కొన్నాయి.


జన్మాష్టమి పూజ ముహూర్తం:
ఇంగ్లీష్‌ క్యాలెండర్ ప్రకారం.. జన్మాష్టమికి నిర్దిష్ట తేదీ లేదు. భారతదేశం వ్యాప్తంగా భాద్రపద మాసంలోని 8వ రోజునా జన్మాష్టమిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం , అష్టమి తిథి ఆగష్టు 18న రాత్రి 09:20 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 19 రాత్రి 10:59 గంటలకు ముగియనుంది.


వేడుకలు:
హిందూ సాంప్రదయం ప్రకారం.. జన్మాష్టమి పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఇప్పటికే భారతదేశంలో ప్రముఖ కృష్ణ దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మహారాష్ట్రలోని జన్మాష్టమిని  దహీ హండి పండుగా జరుపుకుంటారు. అంతేకాకుండా కృష్ణు జన్మించిన మధుర ప్రదేశంలో భక్తులు ఆనందంతో స్వామివారిని కొలుస్తారు.


జన్మాష్టమి రోజునా ఉపవాసాలు పాటించేవారు.. రాత్రిపూట శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల తర్వాత మాత్రమే ఉపవాస దీక్షలు చేస్తారు. స్వామి వారికి ప్రసాదం దేవుడికి సమర్పించి.. పంచామృతాన్ని భక్తులకు పంచి పెడతారు.


(NOTE: కథనం సాధారణ సమాచారంపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)


Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook