Krishna Janmashtami 2022: జన్మాష్టమి నాడు శుభయోగం... ఈ 4 రాశులకు లాభం..!
Krishna Janmashtami 2022: ఇవాళే జన్మాష్టమి. ఈ రోజున శుభయోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో చిన్నికృష్ణుడిని పూజించడం వల్ల ఈ రాశులవారు లాభపడతారు.
Krishna Janmashtami 2022: దేశవ్యాప్తంగా జన్మాష్టమి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈసారి జన్మాష్టమి పండుగను కొంత మంది ఆగస్టు 18న జరుపుకుంటే.. మరికొంత మంది ఇవాళ జరుపుకుంటున్నారు. ఈసారి జన్మాష్టమికి (Krishna Janmashtami 2022) రోహిణి నక్షత్రం ఉండదు, కానీ ఇవాళ శుభప్రదమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగంలో చిన్నికృష్ణుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభం (Taurus): వృషభ రాశిలో జన్మాష్టమి చంద్రుడు సంచరించడం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటక రాశి(Cancer): జన్మాష్టమి కర్కాటక రాశి వారికి చాలా మేలు చేస్తుంది. జన్మాష్టమి నాడు కర్కాటక రాశిలో శుక్రుడు, వృషభరాశిలో చంద్రుడు, శుక్రుడు సంచరిస్తారు. ఈ జన్మాష్టమి రాశిలో మార్పు కర్కాటక రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి (Leo): ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆనందంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి జన్మాష్టమి నాడు శుభ యోగం లాభిస్తుంది.ఈరాశివారు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి పూర్తి సహకారాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా బాగుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
Also Read: Kalashtami Vratam 2022: ఇవాళే కాలాష్టమి వ్రతం.. కాల భైరవుడిని ఇలా పూజించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook