Janmashtami 2022 Remedies: కొంతమంది జన్మాష్టమి పండుగను ఈ రోజు అంటే ఆగస్టు 18, గురువారం జరుపుకుంటున్నారు. మరికొంత మంది ప్రజలు దీనిని ఆగస్టు 19, శుక్రవారం జరుపుకుంటారు. ఈ పండుగను (Janmashtami 2022) దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. శ్రీకృష్ణుడికి నెమలి పించం (Peacock feather) అంటే చాలా ఇష్టం. ఈరోజున నెమలి పించంకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెమలి పించంతో ఈ పరిహారాలు చేయండి
>> కాల సర్ప దోషం నుండి బయటపడేందుకు జన్మాష్టమి రోజున నెమలి పించంను తెచ్చి ఇంటి పూజా మందిరంలో ఉంచండి. 
>> ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలనుకునే వారు జన్మాష్టమి రోజున నెమలి పించంను తెచ్చి డబ్బు ఉంచే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల రాహువు, శని గ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభించడంతోపాటు డబ్బుకు లోటు ఉండదు. ఇంటి దక్షిణ దిశలో నెమలి పించంను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. 
>> వాస్తు దోషాలను పోగొట్టడానికి ఇంటికి ఈశాన్య దిశలో 8 నెమలి ఈకలను ఉంచండి. దీంతో ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. 
>> పిల్లలను నెమలి పించంను తమ వద్ద ఉంచుకుంటే ఏకాగ్రతతో చదువుతారు. తద్వారా పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. 
>> చెడు దృష్టి మీపై పడకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి పించంను ఉంచండి. నెమలి పించంతో పాటు వేణువు కూడా మీతోపాటు ఉంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి.


Also Read: Dahi Handi 2022: దహీ హండి పండుగ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు, దీని విశిష్టత ఏంటి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook