Janmashtami Mistakes: జన్మాష్టమి రోజున పూజలు, వ్రతాలు చేసినా ఒక్కోసారి ప్రతిఫలం దక్కదు. చేసే పూజలో లేదా పద్ధతిలో ఏదో లోపముంటేనే అలా జరుగుతుంది. ఆ పొరపాట్లేంటి, ఏం చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శీ కృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది ఆగస్టు 18, 19 రెండ్రోజులూ జరుపుకుంటున్నారు. పంచాంగం ప్రకారం ఒకరోజు మాత్రం కృష్ణుడి కోసం వ్రతం ఆచరిస్తారు. అయితే తాము చేసే వ్రతం లేదా పూజల్లో ఏ విధమైన లోపం ఉండకూడదనేది ప్రతి భక్తుడి కోరిక. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయినా సరే తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ పొరపాట్లు, తప్పుల కారణంగా కృష్ణుడి ఆగ్రహానికి లోనవుతారు. ఫలితంగా కృష్ణుడి కటాక్షం లభించదు. అందుకే జన్మాష్టమి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..


నల్లరంగుని సహజంగా చీకటికి లేదా అశుభ వస్తువులకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే జన్మాష్టమి నాడు నల్లరంగు వస్తువులు లేదా సామగ్రి కృష్ణుడికి సమర్పించకూడదు. పూజ చేసేటప్పుడు కూడా నల్ల వస్త్రాలు ధరించకూడదు. జ్యోతిష్యం ప్రకారం ఒకవేళ మీరు గుడిలో శ్రీ కృష్ణుడి పూజ చేస్తుంటే..పొరపాటున కూడా వీపు వైపు నుంచి దర్శనం చేయకూడదు. శ్రీ కృష్ణుడి విగ్రహానికి ముందు నుంచే దర్శించుకోవాలి.  లేకపోతే కృష్ణుడి ఫలం దక్కదు.


జన్మాష్టమి నాడు సాత్వికమైన భోజనం చేయాలి. ఆ రోజు పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, మద్యం తీసుకోకూడదు. జన్మాష్టమి నాడు వ్రతం ఉంటే నీళ్లు, పండ్లతో వ్రతం ఉండాలి. జన్మాష్టమి నాడు బియ్యంకు దూరంగా ఉండాలి. హైందవమతంలో జన్మాష్టమి నాడు బియ్యం లేదా జొన్నతో చేసిన పదార్ధాల్ని తినకూడదని ఉంది. లేకపోతే జన్మాష్టమి నాడు వ్రతాలు, పూజలు చేసినా ఫలితం దక్కదు. 


తులసి ఆకులతో..


తులసి ఆకుల్ని సాధారణంగా చాలాచోట్ల వినియోగిస్తుంటారు. అనారోగ్యం నుంచి కాపాడుకునేందుకు తులసి ఆకులతో కాడా లేదా టీ చేసుకుని తాగుతుంటారు. అయితే జన్మాష్టమినాడు తులసి ఆకుల్ని తెంచకూడదు. 


Also read: Janmashtami 2022 Remedies: జన్మాష్టమి రోజు నెమలి పించంతో ఈ పనులు చేయండి, ఇక చూస్కోండి మీ ఇంట్లో డబ్బే డబ్బు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook