Janmashtami Puja And Remedy: జన్మాష్టమి పండుగను (Shri Krishna Janmashtami 2022) భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో ఈ రోజున జన్మించాడు. ఈ రోజున చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి అతనికి ఇష్టమైన వస్తువులను సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు రాత్రంతా జాగరణ ఉంటూ.. భజనలు మరియు కీర్తనలతో శ్రీకృష్ణభగవానుడిని కొలుస్తారు. ఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 18, గురువారం వస్తోంది. ఈ రోజు శ్రీకృష్ణభగవానుడు ఆశీస్సులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలన్నా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీ కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. అందుకే అతడిని మురళీధర అంటారు. వాస్తు ప్రకారం, ఇంట్లో వేణువును ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. చెక్క, వెదురు, వెండి లేదా బంగారం చేసిన వేణువును ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడికి వెండి వేణువును సమర్పించడం ద్వారా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి వ్యాపారంలో నాలుగురెట్లు లాభం పొందుతాడు. వేణువును ఇంట్లో ఉంచడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. 


Also Read: Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook