Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ రోజున స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, రాఖీ పండుగ యెుక్క విశిష్టత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 04:22 PM IST
Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Sawan Purnima 2022: శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని శ్రావణ పూర్ణిమ అంటారు. ఈ రోజున నదీస్నానాలు ఆచరించి దానం చేసి ఉపవాసం ఉండడం ఆనవాయితీ. ఈ రోజు (Shravana Purnima 2022) చంద్రుడు మరియు లక్ష్మీ దేవిని పూజిస్తారు. అంతేకాకుండా భగవంతుడు సత్యనారాయణ కథను వినిపిస్తారు. పౌర్ణమి తిథికి దేవుడు చంద్రుడు, కాబట్టి ఈ రోజున చంద్రుడిని పూజిస్తారు. ఆయనను పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుంది. 

శ్రావణ పూర్ణిమ 2022 తేదీ
పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 12వ తేదీ ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. 

రాఖీ పండుగ తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ (Rakhi Festival 2022) శ్రావణ పూర్ణిమ రోజే జరుపుకుంటారు.  ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి... వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. అదే విధంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ ఏడాది ఆగస్టు 11న రాఖీ పండుగను జరుపుకోనున్నారు.

ఒకే రోజు 3  శుభ యోగాలు
ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున రవియోగం, ఆయుష్మాన్ యోగం, సౌభాగ్యయోగం ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాలూ శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున రవియోగం ఉదయం 05:48 నుండి 06.53 వరకు మాత్రమే. శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం నుండి మధ్యాహ్నం 03.32 వరకు ఆయుష్మాన్ యోగం, ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. ఆగస్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 11.34 గంటల వరకు సౌభాగ్య యోగం ఉంటుంది. శ్రావణ పూర్ణిమ రోజున సాయంత్రం 06:55 గంటలకు చంద్రోదయం ప్రారంభమై.. మరుసటి రోజు ఆగస్టు 12వ తేదీ ఉదయం 05:44 గంటల వరకు చంద్రోదయం ఉంటుంది.

Also Read: Diwali 2022: దీపావళి తర్వాత రోజే సూర్యగ్రహణం.. తేదీ, శుభ సమయం తెలుసుకోండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News