Vrat & Festivals in July 2023: జూలై 04 నుండి శ్రావణమాసం మొదలు.. ఈ నెలలో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఇవే!
Festivals & Vrat list in July 2023: జూలై నెలలో కొన్ని కీలక గ్రహసంచారాలు జరగనున్నాయి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు కూడా రానున్నాయి. వచ్చే నెలలో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసుకుందాం.
July 2023 Vrat and Festival List: గ్రహాల సంచారం, పండుగల మరియు వ్రతాల ఆధారంగా వచ్చే జూలై నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మాసంలోనే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా జూలై 04 నుండి శ్రావణ మాసం మెుదలుకానుంది. అధిక మాసం కూడా ఇదే నెలలో రానుంది. ఇంకా శ్రావణ సోమవారం, హరియాళీ అమావాస్య, కామిక ఏకాదశి, మంగళ గౌరీ వ్రతం కూడా జూలై నెలలో రాబోతున్నాయి.
జూలై పండుగలు మరియు వ్రతాల లిస్ట్:
1 జూలై 2023 - శని ప్రదోష వ్రతం, జయ పార్వతి వ్రతం
2 జూలై 2023 - కోకిల వ్రతం
3 జూలై 2023 - ఆషాడ పూర్ణిమ, గురు పూర్ణిమ
4 జూలై 2023 - శ్రావణ మాసం ప్రారంభం, మొదటి మంగళ గౌరీ వ్రతం
6 జూలై 2023 - గజానన్ కష్టి చతుర్థి
7 జూలై 2023 - పంచక్ ప్రారంభం
9 జూలై 2023 - కాలాష్టమి, భాను సప్తమి
10 జూలై 2023 - మొదటి శ్రావన్ సోమవారం
Also Read: Astrology: రాబోయే 14 రోజులు ఈ 4 రాశుల వారిపై నోట్ల వర్షం.. మీ రాశి ఉందా?
11 జూలై 2023 - రెండవ మంగళ గౌరీ వ్రతం
13 జూలై 2023 - కామికా ఏకాదశి
14 జూలై 2023 - శుక్ర ప్రదోష వ్రతం
15 జూలై 2023 - శ్రావన్ మసిక్ శివరాత్రి
16 జూలై 2023 - కర్క్ సంక్రాంతి
17 జూలై 2023 - శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, హరియాళీ అమావాస్య
18 జూలై 2023 - అధిక మాసం ప్రారంభం, మూడవ మంగళ గౌరీ వ్రతం
21 జూలై 2023 - వినాయక చతుర్థి
24 జూలై 2023 - మూడవ శ్రావణ సోమవారం
25 జూలై 2023 - నాల్గవ మంగళ గౌరీ వ్రతం
29 జూలై 2023 - పద్మిని ఏకాదశి
30 జూలై 2023 - రవి ప్రదోష వ్రతం
31 జూలై 2023 - నాల్గవ శ్రావణ సోమవారం
శ్రావణ మాసం ప్రారంభం
శివపార్వతుల ఆశీస్సులు పొందడానికి శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. వచ్చే నెలలో ఈ మాసం ఆరంభం కానుంది. ఈ మాసంలో నాలుగు శ్రావణ సోమవారాలు, నాలుగు మంగళ గౌరీ వ్రతాలు రానున్నాయి. ఇదే మాసంలో వచ్చే అమావాస్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దీనినే హరియాళీ అమావాస్య అంటారు.
Also Read: Planet transit 2023: మరో ఆరు రోజుల తర్వాత ఈ 4 రాశులకు సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook