Gajkesari Yoga 2023: నేటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
Benefits of Gajkesari Yoga 2023: మేషరాశిలో బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజకేసరి రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Guru Chandra Yuti in Mesh Rashi 2023: గ్రహాలు సృష్టించిన శుభయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడింది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఇవాళే చంద్రుడు కూడా అదే రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మరోవైపు, బృహస్పతి చంద్రుని నుండి కేంద్ర గృహంలో (1 వ, 4 వ, 7 వ మరియు 10 వ ఇల్లు) ఉన్నప్పుడు ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
గజకేసరి రాజయోగం ఈ రాశులకు వరం
మేషం: ఇదే రాశిలో గురు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. మీరు ఊహించని ధనాన్ని పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
మిథునం: మిథునరాశి వారికి గజకేసరి యోగం చాలా లాభాలను ఇస్తుంది. మీరు సమాజంలో గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
తుల రాశి: గజకేసరి యోగం వల్ల తులరాశి వారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2023: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారు నష్టపోవడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook