Shukra Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఇతడు అందం మరియు ఐశ్వర్యానికి కారకుడిగా పరిగణిస్తారు. ఇతర గ్రహాల లాగే.. శుక్రుడు కూడా తన రాశిని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటాడు. శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావం చూపుతుంది. ఈనెల 2న శుక్రుడు మిథునరాశిలో సంచరించాడు. దీని కారణంగా మూడు రాశులవారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మీన రాశి
మిథునరాశిలో శుక్రుని సంచారం వల్ల మీన రాశి వారు అనేక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. మీరు కోర్టు కేసుల్లో ఓడిపోతారు. మీ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు యోగా, ధ్యానం చేయడం మంచిది.
ధనుస్సు రాశి
శుక్ర గోచార సమయంలో ధనస్సు రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ గౌరవం దెబ్బతింటుంది. మీ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. పొరుగువారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని మరియు శుక్ర దేవుడిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
కర్కాటక రాశి
శుక్ర సంచారం వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. శుక్రవారం ఆవుకు రొట్టెలు తినిపించడం మంచిది.
Also Read: Mercury Margi 2023: రాబోయే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook