Akhand Samrajya RajYog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమిస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. శనిదేవుడు ఇవాళ అంటే జనవరి 17న కుంభరాశిలో సంచరించనున్నాడు. దేవతల గురువైన బృహస్పతి ఏప్రిల్ తన రాశిచక్రాన్ని మార్చనున్నాడు. దీని కారణంగా 'అఖండ సామ్రాజ్య రాజయోగం' (Akhand Samrajya RajYog) ఏర్పడుతుంది. ఈ యోగం కొందరికి అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖండ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం (Aries): అఖండ సామ్రాజ్య రాజయోగం మేషరాశి వారికి  శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ జాతకంలోని ఆదాయ స్థానంలో ఉన్నాడు. దీంతో మీరు పెద్ద మెుత్తంలో  డబ్బును పొందుతారు. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభపడతారు. రాజకీయాల్లో  ఉన్నవారు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. మీరు తీసుకున్న రుణం చెల్లిస్తారు. 


మిథున రాశిచక్రం (Gemini): అఖండ సామ్రాజ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవాళ ఈ రాశివారిపై శని ధైయా మగుస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. జాబ్ చేసేవారు కోరుకున్న చోటికి  బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల భారీ మెుత్తంలో లాభాలను గడిస్తారు. 


మకర రాశిచక్రం (Capricorn): అఖండ సామ్రాజ్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే జనవరి 17న శనిదేవుని సంచారం తర్వాత శని మీ ఇంటిపై కూర్చుంటాడు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే గౌరవం, ఆదరణ పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీ అప్పు తీరుతుంది. మీరు విదేశాలకు వెళ్లే  అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2023: శుక్రుడి మీనరాశి ప్రవేశం... ఈ రాశులవారికి లాటరీ తగలడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook