Niyati Palat Rajyog: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగం.. వీరి జీవితాల్లో పెను మార్పులు ఖాయం..
Niyati Palat Rajyog: ఫిబ్రవరిలో అరుదైన యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయి.
Guru-Shukra Yuti 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు తమ గమనాన్ని నిర్ణీత సమయాల్లో మార్చుకుంటాయి. దీని కారణంగా అనేక శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరిలో కొన్ని గ్రహాల గమనంలో మార్పు రానుంది. దీని కారణంగా అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. శనిదేవుడు ఇటీవల కుంభరాశిలోకి, బృహస్పతి తన రాశిచక్రం మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలోనే శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒకే రాశిలో గురు, శుక్రుడు కలయిక వల్ల అరుదైన నియతి పాలత్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో పెను మార్పు రానుంది.
మిధునరాశి (Gemini)
నియతి పాలత్ రాజయోగం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారి జాతకంలో పదవ స్థానంలో హన్స్ మరియు మాళవ్య రాజయోగం ఏర్పడుతున్నాయి. మిథునరాశి వారి అదృష్ట స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. దీని కారణంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. గురు, శుక్ర గ్రహాల ప్రభావం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
ఈ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. గురు మరియు శుక్రుల కలయిక మీ త్రికోణ గృహంలో జరగబోతోంది. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం మరియు బృహస్పతి తన స్వంత రాశిలో ఉండటం వల్ల మీరు ఈ సమయంలో ఆస్తి లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు షేర్లు, స్పెక్యులేటివ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు భారీగా లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క జాతకంలో ఏడవ ఇంటిలో గురు మరియు శుక్రుల కలయిక జరుగుతోంది. రోజువారీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
Also Read: Jupiter Asta 2023: మీనంలో అస్తమించబోతున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారికి కష్టాలే కష్టాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook