Guru Shukra Gochar: యవ్వనంలోకి ప్రవేశించిన గురుడు-శుక్రుడు.. ఈ 4 రాశులకు అపారమైన ధనం..
Guru And Venus Transit: ఆస్ట్రాలజీ ప్రకారం, గురు మరియు శుక్రులు యవ్వన దశలోకి ప్రవేశించారు. దీని వల్ల 4 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు.
Guru And Venus Enter In Youth Stage: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యంలో గ్రహాలు ఎప్పటికప్పుడు సంచరిస్తాయి. రీసెంట్ గా బృహస్పతి మరియు శుక్ర గ్రహాలు యవ్వనంలోకి (Guru And Shukra Planets In Youth Stage) ప్రవేశించాయి. దీని ప్రభావ కారణంగా నాలుగు రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మీన రాశిచక్రం
యుక్త వయస్సులో బృహస్పతి మరియు శుక్ర గ్రహాల కదలికలు శుభప్రదంగా ఉంటాయి. ఎందుకంటే గురు గ్రహం మీ సంచార జాతకంలో హన్స్ అనే రాజయోగాన్ని సృష్టించింది. మరోవైపు, శుక్ర గ్రహం మీ సంచార జాతకంలో మాళవ్య రాజయోగాన్ని కూడా ఏర్పరుస్తుంది. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ఏ వర్క్ చేసినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. బిజినెస్ భారీగా విస్తరిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
వృషభ రాశి
యంగ్ బృహస్పతి మరియు శుక్ర గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో బృహస్పతి మరియు శుక్రుడు శుభస్థానాలలో కూర్చున్నారు. దీని కారణంగా మీ కోరికలు నెరవేరుతాయి. విదేశీ వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందుతారు. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశిచక్రం
యువ స్థితిలో గురు, శుక్రుల సంచారం కర్కాటక రాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి మరియు శుక్రులు ప్రయాణిస్తున్నారు. దీంతో మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ జాతకంలోని హన్స్ మరియు మాళవ్య రాజయోగం ఏర్పడటం వల్ల మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
ధనుస్సు రాశిచక్రం
చిన్న వయస్సులో బృహస్పతి మరియు శుక్ర గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో మాలవ్య మరియు హన్స్ అనే రాజయోగం ఏర్పడుతోంది. దీని కారణంగా మీ ఇంట్లో శుభకార్యం ఏర్పడే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook