Trigraha Yogam benefits: 30 ఏళ్ల తర్వాత శని రాశిలో త్రిగ్రహ యోగం.. ఈరాశులకు అన్‌స్టాపబుల్ బెనిఫిట్స్..

Shani Surya Budh Yuti 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 30 సంవత్సరాల తర్వాత శని యొక్క రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 11:05 AM IST
Trigraha Yogam benefits: 30 ఏళ్ల తర్వాత శని రాశిలో త్రిగ్రహ యోగం.. ఈరాశులకు అన్‌స్టాపబుల్ బెనిఫిట్స్..

Trigrahi Yog 2023 benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, కాలానుగుణంగా గ్రహాల పరివర్తనంలో మార్పు వస్తుంది. 30 ఏళ్ల తర్వాత శని, సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. శని యెుక్క కుంభరాశిలో ఈ యోగం మూడు దశాబ్దాల తర్వాత ఏర్పడింది.  3 రాశుల వారికి ఈ యోగం చాలా శుభప్రదం. త్రిగ్రాహి యోగం వల్ల ఏ అదృష్ట రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

త్రిగ్రాహి యోగం ఏ రాశులకు శుభప్రదం
వృషభం: శని, సూర్యుడు, బుధ గ్రహాల కలయికతో ఏర్పడిన త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి బలమైన ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
మిథునం: మిథునరాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. లక్ కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.
కుంభం: కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. మీరు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. వ్యాపారానికి ఈసమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 

Also Read: Holi 2023: హోలీ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News