Jupiter Transit in Bharani Nakshatra 2023: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. గురుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్లడానికి ఏడాదిన్నర పడుతుంది. ప్రస్తుతం గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు నిన్ననే తన నక్షత్రాన్ని కూడా మార్చాడు. బృహస్పతి జూన్ 21వ తేదీ 1.19 గంటలకు భరణి నక్షత్రంలోకి ప్రవేశించారు. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం
తులారాశి
బృహస్పతి సంచారం తులారాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్లోమంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. సొంత కంపెనీ ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 


ధనుస్సు రాశి
భరణి నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 


Also Read: Mangal gochar 2023: ఎదురెదురుగా రాబోతున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..


మకరరాశి
గురు నక్షత్ర సంచారం మకర రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీని సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు ప్రశంసలు లభిస్తాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు పదోన్నతులకు సంబంధించిన శుభవార్తలను వింటారు. ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు.


మేషం
గురుడు రాశి మార్పు మేషరాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులకు లాభిస్తుంది. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ధన లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 


సింహం
సింహ రాశి వారికి ఈ గురు నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 


Also Read: Ketu Gochar 2023: ఏడాదిన్నర తర్వాత ఈ రాశుల జీవితాల్లో వెలుగులు.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook