Mars Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, జూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ అంగారకుడిని అగ్ని మూలక గ్రహంగా మరియు సింహం అగ్నిమూలక రాశిగా పేర్కొంటారు. అంగారకుడు ఈ రాశిలోకి ప్రవేశించగానే ఉగ్రుడు అవుతాడు. ఇదే సమయంలో శని, కుజుడు కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తారు. అంతేకాకుండా ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. సంసప్తక యోగ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి
కుజుడు మరియు శని ముఖాముఖిగా ఉండటం వల్ల మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సరైన డైట్ ఫాలో అవ్వండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి.
కర్కాటక రాశి
కుజుడు, శని ఎదురెదురుగా ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు ఎవరితోనూ వాదించకండి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది.
కన్య రాశి
మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఏ నిర్ణయం తీసుకున్న జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురవుతారు.
Also Read: Budh Gochar 2023: జూన్ 24న మిథునరాశిలో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం..
మకరరాశి
మకర రాశి వారు ఈ సమయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గే అవకాశం ఉంది. మిమ్మల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఏవైనా వివాదాలు ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook