Jupiter Moon Conjunction 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం మార్చ్ 22వ తేదీన మీనరాశిలో గురుడు, చంద్రుడి యుతి ఏర్పడనుంది. గురు, చంద్ర యుతితో ఏర్పడనున్న రాజకేసరి రాజయోగం 3 రాశులకు అత్యంత లాభం కల్గించనుంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ప్రస్తుతం గురుడు మీనరాశిలో ఉన్నాడు. మార్చ్ 22వ తేదీన చంద్రుడు కూడా మీనంలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా గురు చంద్ర యుతి ఏర్పడనుంది. గురు చంద్ర యుతితో రాజకేసరి రాజయోగం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 3 రాశులకు అత్యంత లాభదాయకం కానుంది. ఆ రాశులకు అంతులేని ధనం, అభివృద్ధి, అన్నింటా విజయం కలగనున్నాయి. 


మేష రాశి


గురు చంద్ర యుతితో ఏర్పడనున్న రాజకేసరి రాజయోగం మేషరాశి జాతకులకు అత్యంత శుభ ఫలాలనిస్తుంది. విదేశాల్నించి భారీగా లాభం కలగనుంది. ప్రత్యేకించి వ్యాపారులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. ఒత్తిడి నుంచి రక్షింపబడతారు.


వృషభ రాశి


గురు చంద్రుల యుతితో ఏర్పడనున్న రాజకేసరి రాజయోగం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కానీ వృషభ రాశివారికి చాలా లబ్ది చేకూర్చనుంది. ఈ రాశివారి ఉద్యోగ, వ్యాపారాల్లో సక్సెస్ ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. పాత పెట్టుబడులు కలిసొస్తాయి. 


మిథున రాశి


గురు చంద్రుల యుతితో ఏర్పడనున్న రాజకేసరి రాజయోగంతో మిథున రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభమౌతాయి. కెరీర్ లాభంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గౌరవ, మర్యాదలు ఉంటాయి. ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఇళ్లు, వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారం బాగుంటుంది.


Also read: Surya gochar 2023: గురుడి రాశిలో సూర్యుడి రాకతో..ఈ 8 రాశులకు బంపర్ ఆఫర్, ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook