Guru Margi 2022: దీపావళి తర్వాత అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్న బృహస్పతి...ఈ 3 రాశులకు తిరుగుండదు మరి..
Guru Margi 2022: నవంబరు 24న గురుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Guru Margi 2022: జ్ఞానం, సంపద, విద్య, గురువు, పిల్లలు మరియు దాతృత్వానికి కారకుడు బృహస్పతి. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెల 24న మార్గంలోకి (Guru Margi 2022) వస్తాడు. అదే సమయంలో గురుడు అఖండ సామాజ్ర్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. అంటే గురుడు గమనం వల్ల వీరు అపారమైన సంపదను పొందనున్నారు. అంతేకాకుండా కెరీర్ లో అద్భుతమైన పురగోతిని సాధించనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): బృహస్పతి సంచారం వల్ల అఖండ సామ్రాజ్య యోగం వృత్తి, వ్యాపారాలలో విజయాన్ని ఇస్తుంది. ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. దీంతో ఈ రాశులవారు ఈ సమయంలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు మీ రంగంలో రాణించగలుగుతారు. ఏదైనా ఆస్తి లేదా వాహనం కనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, తద్వారా లాభాలు వస్తాయి.
కర్కాటకం (Cancer): ఆస్ట్రాలజీ ప్రకారం, బృహస్పతి ఈ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు చదువుపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. బిజినెస్ విషయమై వ్యాపారులు ప్రయాణాలు చేస్తారు. వీరు అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేస్తారు.
మిథునం (Gemini): ఈ బృహస్పతి సంచారం మిథున రాశి వారికి చాలా మేలు చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ రాశుల యెుక్క 10వ ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. దీంతో ఈ రాశికి చెందిన పిల్లలు మంచిగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.
Also Read: Deepavali 2022: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook