Benefits of Amla Rajyog 2023: గ్రహాలన్నింటిలో కెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. ఇతడి స్థానంలో లేదా గమనంలో లేదా రాశిలో మార్పు వచ్చిందంటే అది ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రేపు అంటే సెప్టెంబరు 04న బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీని కారణంగా అరుదైన అమల లేదా ఉసిరి రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక వ్యక్తి యొక్క రాశి చంద్రుడు లేదా లగ్నము నుండి పదవ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఉసిరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఏయే రాశుల వారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనరాశి
గురుడు గమనంలో మార్పు వల్ల మీనరాశి వారి ఆదాయం పెరుగుతుంది. దీంతో వీరి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. అయితే వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ కెరీర్ బాగుంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. జాబ్ వచ్చే అవకాశం ఉంది.
తులారాశి
ఉసిరి రాజయోగం తులరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఆస్తి కలిసి వస్తుంది. అంతేకాకుండా సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. 
మిథునరాశి
బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన రాజయోగం మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో ఎదుగదల ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. 


Also Read: Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు..వీరి జీవితాల్లో హెచ్చు తగ్గులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook