Weekly Horoscope: సెప్టెంబర్‌లోని మొదటి వారంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా నక్షత్రాలు కూడా మరబోతున్నాయి. అయితే ఈ సమయంలో మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వారపు జాతకాన్నిగ్రహాల గమనాన్ని బట్టి లెక్కిస్తారు. అయితే ఈ గమనాల కారణంగా కొన్ని రాశులవారికి ఈ ప్రభావం కారణంగా శుభ ఫలితాలు కలిగితే..మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఏయే రాశులవారికి..ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వారం రాశి ఫలాలు ఇవే:
మేష రాశి:
మేష రాశి వారు ఈ వారం పని పట్ల ఎంతో ఉత్సాహంతో ఉంటారు. కానీ మాట్లాడే క్రమంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ తండ్రికి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం మీకు తల్లి మద్దతు లభించి ఎలాంటి పనులనైన సులభంగా చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో మార్పులు రావచ్చు. దీని కారణంగా కంపెనీలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం ఖర్చులు కూడా పెరగవచ్చు.
వృషభ రాశి:
ఈ రాశివారికి సహనం లోపించడం కారణంగా తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఈ వారం విద్యా పనులలో ఆటంకాలు కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారు స్నేహితులతో కలిసి మరింత విస్తరించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరికి శ్రమ పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఖర్చులు పెరగడం కారణంగా ఉద్యోగాలు మరోచ్చు. ఈ వారం వీరికి స్నేహితుల మద్దతు లభించి అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. దీని కారణంగా ప్రశాంతత లోపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. స్నేహితుల సహాయంతో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా భవిష్యత్‌లో ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఖర్చులు పెరగడం వల్ల చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు..కాబట్టి అతిగా ఖర్చు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
ఈ వారం కర్కాటక రాశివారు భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. మితిమిరిన కోపం కారణంగా తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం చాలా మేలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి