Guru Vakri 2023: సెప్టెంబర్ నెలలో గురుడు తిరోగమనం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
Guru Vakri 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. సెప్టెంబరులో గురుడు తిరోగమనం చయబోతున్నాడు. గురు వక్రీ కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Vakri Guru 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. గురుడు ఏడాదికొకసారి తన రాశిని మారుస్తాడు. ఈ సంవత్సరం బృహస్పతి 12 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది మే 2024 వరకు బృహస్పతి మీన రాశిలో ఉంటాడు. ఈలోగా గురు సంచారంలో మార్పు రానుంది. సెప్టెంబర్ నెలలో గురుడు తిరోగమనం చేయబోతున్నాడు. గురుడు వ్యతిరేక కదలిక మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. తిరోగమన బృహస్పతి 3 రాశుల వారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం: సెప్టెంబర్ నెల నుండి మేష రాశి వారు మంచి లాభాలను పొందుతారు. ప్రతి నెల అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆగిపోయిన పని తిరిగి ప్రారంభమవుతుంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిథునం: గురుగ్రహ తిరోగమనం వల్ల మిథునరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ స్థిర చరాస్తులు ప్రాప్తిస్తాయి.
Also Read: Shani Vakri 2023: శని తిరోగమనం..నవంబర్ వరకు ఈ రాశులకు చెప్పలేనంత ధనం..
కర్కాటకం: బృహస్పతి రివర్స్ కదలిక కర్కాటక రాశి వారికి వరమనే చెప్పాలి. మీరు కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు జాబ్ లో ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బుతిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Budh Uday 2023: రేపు కర్కాటక రాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook